
వదంతులు నమ్మి.. ఉల్లిబస్తాలు ఎత్తుకెళ్లి!
మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. కొనేవారు లేకపోవడంతో రోజూ వందలాది క్వింటాళ్ల ఉల్లి కుళ్లిపోతోంది. అలాంటి వాటిని మార్క్‌ఫెడ్ పారబోస్తోంది. పారబోసే బదులు తమకు ఇస్తే గ్రేడింగ్ చేసుకొని వాడుకుంటాం కదా.. అనుకున్నారో.. ఏమో.. వందల మంది ప్రజలు మంగళవారం మార్కెట్ యార్డులోకి ప్రవేశించి ఉల్లి బస్తాలను ఎత్తుకెళ్లారు. పలువురు ద్విచక్ర వాహనాలు, తోపుడుబండ్లు, ఆటోల్లో వేసుకొని వెళ్లారు. మార్కెట్ కమిటీ అధికారులు అప్రమత్తమై 4వ పట్టణ పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు అక్కడికి చేరుకొని కట్టడి చేశారు. ఆధార్ కార్డు చూపించి రూ.100 చెల్లిస్తే బస్తా ఉల్లిగడ్డలు ఇస్తున్నారనే వదంతుల వల్లే ఇలా జరిగిందని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు.
– కర్నూలు(అగ్రికల్చర్)