మందులకు వెళ్లి మృత్యుఒడిలోకి ... | - | Sakshi
Sakshi News home page

మందులకు వెళ్లి మృత్యుఒడిలోకి ...

Sep 17 2025 7:27 AM | Updated on Sep 17 2025 7:27 AM

మందుల

మందులకు వెళ్లి మృత్యుఒడిలోకి ...

● గుండెపోటుతో రైతు మృతి భూసారంపై విద్యార్థులకు అవగాహన ● పీఎంశ్రీ కింద ఉమ్మడి జిల్లాలో 38 మోడల్‌ స్కూళ్లు ఎంపిక అంతర్‌ జిల్లాల బైక్‌ దొంగ అరెస్ట్‌

కోసిగి: ఆరోగ్యం బాగా లేదు మందులు తెచ్చుకుంటానని ఇంటి నుంచి వెళ్లిన ఓ రైతు గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..మండల పరిధిలోని సజ్జలగుడ్డం గ్రామానికి చెందిన కురువ వేమన్న (65)కు ఎకర సొంత పొలం, మరో 3 ఎకరాలు కౌలుభూమి ఉంది. ఇందులో రెండెకరాలు ఉల్లిపంట సాగు చేశాడు. ఉల్లి ధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా రాలేదు.మిగతా రెండెకరాల్లో వేసిన పత్తి పంట ఇటీవల కురిసిన వానలకు దెబ్బతినంది. ఈక్రమంలో పంటసాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో అనారోగ్యానికి గురయ్యాడు. మంగళవారం మందులు తెచ్చుకుంటానని ఇంట్లో చెప్పి కోసిగికి వెళ్లిన అతను బస్టాండ్‌ సమీపంలో కుప్పకూలిపోయాడు. స్థానికులు గమనించి లేపే ప్రయత్నం చేసేలోపు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతుడికి భార్య లసుమమ్మ, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): భూమి ఎలా ఉండాలి.. నేలలో ఏఏ పోషకాలు ఉండాలి.. ప్రస్తుతం నేల పరిస్థితి ఎలా ఉంది... భూమి ఆరోగ్య స్థితి బాగుండాలంటే ఏమి చేయాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన మోడల్‌ స్కూళ్లలో విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రం మొత్తం మీద 297 మోడల్‌ స్కూళ్లను ఇందుకోసం వ్యవసాయ శాఖ ఎంపిక చేసింది. కర్నూలు జిల్లాలో 16, నంద్యాల జిల్లాలో 22 ప్రకారం మోడల్‌ స్కూళ్లను ఎంపిక చేశారు. ఈ స్కూళ్లలో రైతుకుటుంబాలకు చెందిన పిల్లలే చదువుతుంటారు. విద్యార్థి దశలోనే వారికి భూ మి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ద్వార భవిష్యత్తులో ప్రయోజనాలు ఉంటాయని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబరు నెల లో ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చనుంది.

వెల్దుర్తి: ద్విచక్రవాహనాలు చోరీకి పాల్పడుతున్న అంతర్‌ జిల్లాల దొంగను అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం బుగ్గ సంగాల వద్ద పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.కాగా పట్టుబడిన బైక్‌ల దొంగ పింజరి షేక్షావలి వెల్దుర్తి మండల పరిధిలోని ఎల్‌ నగరం గ్రామ టీడీపీ కార్యకర్త. గతంలో బుక్‌ కీపర్‌గా విధులు నిర్వహించిన ఇతను కర్నూలు, అనంతపురం జిల్లాలలో బైక్‌ల చోరీలకు పాల్పడుతూ వస్తున్నాడు. అయితే, పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఈ దొంగను ఈనెల 15వ తేదీన బుగ్గ సంగాల వద్ద కసాపురం పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి విలువైన బజాజ్‌ పల్సర్‌ 125 సీసీ బైక్‌లు నాలుగు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎన్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

మందులకు వెళ్లి  మృత్యుఒడిలోకి ... 1
1/1

మందులకు వెళ్లి మృత్యుఒడిలోకి ...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement