
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
కర్నూలు: శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఏపీ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని హైకోర్టు సాధన సమితి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు హైకోర్టు సాధన సమితి నాయకులు రామాంజినేయులు, నరసింహులు, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టులోని న్యాయదేవత విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. ఒకప్పటి ఆంధ్ర రాజధాని కర్నూలుకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా నాయకులు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం డీఆర్వో వెంకటనారాయణమ్మకు వినతిపత్రం అందించారు.