
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న కూటమి సర్కార్
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సర్కార్ ప్రతికా స్వేచ్ఛను సైతం హరించి వేస్తున్నారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రానికి స్థానం లేకుండా పోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తే పత్రికలు, ఎడిటర్లపై కేసులకు సైతం వెనుకాడటం లేదు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక మీడియాపై దాడికి తెగబడుతోంది. ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపినందుకు ఇటీవల కాలంలో సాక్షి ఎడిటర్‌తోపాటు మరి కొందరిపై తాడేపల్లి పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. – కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బనగానపల్లె