
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులా?
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా కేసులు నమోదు చేయడం దారుణం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను గౌరవించాలి. కక్ష పూరితంగా వ్యవహరించడం పద్ధతి కాదు. రాజ్యాంగం విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం పత్రికల గొంతు నొక్కడం సమంజసం కాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై కూటమి ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలి. విలేకరుల సమావేశంలో ఓ నాయకుడు మాట్లాడిన అంశాలను పత్రికలో ప్రచురిస్తే ఎడిటర్‌పై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. ‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు మానుకొని కేసులను ఉపసంహరించుకోవాలి.
– బుట్టారేణుక, కర్నూలు మాజీ ఎంపీ