
కుళ్లి.. రైతుకు కన్నీరే మిగిలి!
‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు’ అని పెద్దలు అంటూ ఉంటారు. ఉల్లిపాయలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఈ నానుడి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెద్దల మాటలను, రైతుల కష్టాన్ని పట్టించుకోవడం లేదు. ప్రజలకు ఎంతో మేలు చేసే ఉల్లిగడ్డలు వృథాగా ఉండి కుళ్లిపోతున్నా కనీస చర్యలు తీసుకోవడం లేదు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి, ప్రకృతి వైపరీత్యాలను ఎదిరించి, అహోరాత్రులు శ్రమించిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. వేల రూపాయలు ఖర్చు చేసి కర్నూలు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చినా గిట్టుబాటు ధరలతో కొనుగోలు చేసే వారు కరువయ్యారు. దీంతో ఉల్లి సంచులను వదిలేసి వెళ్లారు. కర్నూలు మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఉల్లి దిగుబడులే కనిపిస్తూ పాలన వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు