
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పెద్దకడబూరు: జాలవాడి గ్రామానికి చెందిన వలస కూలీ హైదరాబాదులో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వివరాలు..కురువ జంపాపురం ఆంజనేయులు (35) నెల రోజుల క్రితం ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని గ్రామంలో తల్లి దగ్గర వదిలి భార్య లక్ష్మి తో హైదరాబాద్‌కు వలస వెళ్లాడు.శ్రావణమాసం కావడంతో భార్య లక్ష్మి ఉరుకుంద ఈరన్న స్వామి మొక్కు తీర్చుకునేందుకు సొంతూరుకు వచ్చింది.అక్కడే కూలీ పనులు చేసుకుంటున్న ఆంజనేయులు బుధవారం నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌కు నీళ్లు పట్టడానికి వెళ్లి బోరు వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందా డు. అక్కడున్న వారు ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశారు. గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టకపోవడం వల్లే కూలీలు వలస వెళ్లి మృత్యువాత పడుతున్నారని గ్రామస్తులు వాపోయారు.