
ట్రాలీ ఆటో బోల్తా : 20 మందికి గాయాలు
వెల్దుర్తి: హైవే–44పై వెల్దుర్తి పట్టణ సమీపంలో ఈద్గా వద్ద ట్రాలీ ఆటో టైర్ పేలడంతో అందులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు. వారంతా బుధవారం డోన్ పట్టణానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బేతంచెర్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన 20 మంది వైఎస్సార్‌సీపీ శ్రేణులు ట్రాలీ ఆటోలో డోన్‌కు వెళ్లి వెల్దుర్తి మీదుగా తిరిగివస్తున్నారు. హైవేపై వెల్దుర్తి సమీపంలోకి రాగానే టైరు పేలి ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న యంబాయి ఎంపీటీసీ సభ్యుడు నాగేశ్వరరావుతో పాటు బాలరాజు, చంద్రశేఖర్, వరుణ్, గోవిందులకు తీవ్రగాయాలు కాగా బాలమద్దయ్య, లక్ష్మీదేవి, దిలీప్, మహేశ్, మద్దిలేటి స్వామి, శ్రీనివాసులు, పుల్లయ్య, స్వాములు, మద్దిలేటి, రాజు, మద్దయ్య, గోపాల్, ప్రతాప్, శ్రీనుకు స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెల్దుర్తి సీహెచ్‌సీకి తరలించారు. బాలరాజు, చంద్రశేఖర్, వరుణ్, గోవిందును మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
మానవత్వం చాటుకున్న
మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
ఘటనా స్థలంలో క్షతగాత్రులు పడి ఉండగా ఆ మార్గంలో వచ్చిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వారిని గమనించి వాహనాన్ని ఆపారు. ప్రమా ద వివరాలు తెలుసుకున్నారు. అంబులెన్స్‌కు సమాచారమిస్తూ, క్షతగాత్రులను పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు. ఎంపీటీసీ సభ్యుడు నాగేశ్వరరావు, తీవ్ర గాయాల పాలైన మరికొందరిని ముందుగా మరో వా హనంలో వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మరికొందరిని హైవే అంబులెన్స్‌లో తరలించారు. హైవే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో సహకరించారు. ప్ర మాదానికి కారణమైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

ట్రాలీ ఆటో బోల్తా : 20 మందికి గాయాలు

ట్రాలీ ఆటో బోల్తా : 20 మందికి గాయాలు