
● విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కారు చెలగాటం ● ఇంటర్
కర్నూలు కల్చరల్: ఇంటర్ ఫలితాలు వచ్చి నాలుగు నెలులు కావస్తున్నా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కాలేదు. నేటికీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకెంతకాలం నిరీక్షించాలని కూటమి సర్కారును ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 82 డిగ్రీ కళాశాలలున్నాయి. ఇంటర్ పూర్తయిన విద్యార్థుల్లో సగం మంది ఇంజినీరింగ్ వైపు వెళితే మిగతా వారు డిగ్రీలో ప్రవేశానికి ఆసక్తి చూపుతారు. సివిల్స్, సర్వీస్ కమీషన్, పోలీస్ శాఖ, అగ్ని మాపక, అటవీ శాఖ, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉండటంతో డిగ్రీ కోర్సులపై దృష్టి సారిస్తారు. అయితే. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి సర్కారు ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఈనెల 18 నుంచి ప్రవేశాలకు నోటిిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఆ ప్రకారం నోటిఫికేషన్ వస్తుందా.. లేదా అనే సందిగ్ధంలో
విద్యార్థులున్నారు. ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ దెబ్బతిందని భవిష్యత్తులో ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు, పీజీ ప్రవేశాలకు అర్హత కోల్పోతామని పలువురు ఆవేదన చెందుతున్నారు.
ఎమ్మిగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముఖ ద్వారం
ఆర్‌యూ పరిధిలో డిగ్రీ కళాశాలల వివరాలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 14
పైవేట్ డిగ్రీ కళాశాలలు 68
మొత్తం కళాశాలల సంఖ్య 82
గత ఏడాది ప్రవేశాలు పొందిన
విద్యార్థులు సంఖ్య 9,204
అబ్బాయిల సంఖ్య 4,714,
అమ్మాయిల సంఖ్య 4,490
బీఏ 1,469
బీకాం 3,291,
బీఎస్సీ 3,367,
బీబీఏ 380
బీఏసీ 697 మంది
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఇప్పటికే పలు అసంబద్ధ నిర్ణయాలు అమలు చేయడంతో విద్యా రంగం గాడితప్పింది. ఇంటర్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా డిగ్రీ ప్రవేశాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమవుతోంది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం మాని అకడమిక్ క్యాలెండర్ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి.
– భాస్కర్, రాష్ట్ర అధ్యక్షులు, పీడీఎస్‌యూ
సమన్వయ లోపంతోనే ఇలాంటి పరిస్థితి
ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి మధ్య సమన్వయ లోపంతోనే డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ ఆలస్యమవుతోంది. సింగిల్ లేదా డ్యూయల్ మేజర్ సబ్జెక్టులపై స్పష్టత ఇవ్వడంలో, అవగాహన కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దీంతో మెరిట్ విద్యార్థులు ఇతర రాష్ట్రలకు వెళుతున్నారు. డిగ్రీ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలి. లేని పక్షంలో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది.
– స్వామి, ఏబీవీపీ కర్నూలు విభాగ్ కన్వీనర్

● విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కారు చెలగాటం ● ఇంటర్

● విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కారు చెలగాటం ● ఇంటర్