కొలిమిగుండ్ల: గొర్విమానుపల్లె సమీపంలో ఆదివారం రోడ్డు పక్క న కారు అదుపు తప్పి బోల్తా పడింది. పెట్ని కోట వైపు నుంచి తాడిపత్రికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యలో గొర్విమానుపల్లె దాటాక లొక్కిగుండం సమీపంలో అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి మాత్రమే ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. కారులో ఇరుక్కుపోయిన ఆ వ్యక్తిని స్థానికులు అద్దాల పగుల గొట్టి బయటకు తీశారు.
ఆళ్లగడ్డలో చోరీ
ఆళ్లగడ్డ: పట్టణంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొరుగుల బట్టి వీధికి చెందిన సంజీవరాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి పట్టణంలోని ఓ ప్రార్థనా మందిరానికి వెళ్లారు. రాత్రి 9.30 గంటల సమయంలో ప్రార్థన ముగించుకుని ఇంటికి వచ్చేసరికి దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాను పగులగొట్టి అందులో ఉన్న రూ.1.50 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. సంజీవరాయుడు కుమార్తెకు ఇటీవల వివాహం నిశ్చయం కాగా.. అందుకు సంబంధించి బంగారు, నగదు సిద్ధం చేసుకున్నాడు. ఇంతలో చోరీ జరగడంతో కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ యుగంధర్ తెలిపారు.
ఏపీహెచ్‌ఎంఏ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయు సంఘం ( ఏపీహెచ్‌ఎంఏ) జిల్లా నూ తన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఏపీహెచ్‌ఎంఏ భవన్‌లో ఏర్పాటు చేసిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో 2025–27 కాల వ్యవధికి నూత న కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా వై. నారాయణ, డీసీ హుస్సేన్, ట్రేజరర్‌గా రమేష్‌నాయుడులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పూర్వపు అధ్యక్షుడు జి.ఒంకార్ యాదవ్ పాల్గొన్నారు.
స్నేహితుల ఆపన్న హస్తం
మంత్రాలయం రూరల్: స్నేహితుల దినోత్స వం స్నేహభావం పరిమళించింది. స్నేహితుడు మృత్యువాత పడగా తోటి మిత్రులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. మంత్రాలయానికి చెందిన డి.భీమేష్ అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న 2003 కు చెందిన 10 తరగతి బ్యాచ్ స్నేహితులు రూ.60 వేలు స్నేహితుడి కూతురు దీక్షిత పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు.బాండ్‌ను మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుడి భార్య రాధ భర్త స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.
మద్దికెరలో..
మద్దికెర: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 2004 –05లో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు తమతో పాటు చదువుకొని కొందరు మిత్రులు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు రూ.72 వేలు అందజేశారు. మాజీ ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు రంగస్వామి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
పొలంలో అక్రమ తవ్వకాలు
చిప్పగిరి: రైతులను సంప్రదించకుండా, కనీస సమాచారం ఇ వ్వకుండా గాలి మరల కంపెనీ తమకు ఇష్టం వచ్చినట్లు అక్రమంగా తవ్వకాలు జరుపుతోంది. చిప్పగిరి మండలంలోని నేమకల్లు గ్రామానికి చెందిన తలారి నెట్టికల్లుకు 0.99 ఎకరాల పొలం ఉండగా అందులో పెద్దకాలువ తవ్వి వదిలేశారు. తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చినా ఫలితం రాలేదని, జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళతానని రైతు తెలిపారు.
అదుపు తప్పి కారు బోల్తా
అదుపు తప్పి కారు బోల్తా
అదుపు తప్పి కారు బోల్తా