
8 నెలలుగా ఎదురుచూపులే..
ఉపాధ్యాయుడుగా కర్నూలు మండలం అంబేడ్కర్ పీఎస్‌హెచ్‌గా గత ఏడాది అక్టోబర్‌లో పదవీ విరమణ పొందాను. ఎనిమిది నెలలు గడచిపోయినా పూర్తి స్థాయిలో బెనిఫిట్స్ రాలేదు. ఇప్పటికీ గ్రాట్యూటీ రూ.16 లక్షలు పెండింగ్‌లో ఉంది. హాఫ్ పే లీవ్స్ బకాయిలు రూ.9 లక్షలు ఇవ్వాలి. వీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ఇలా వేధించడం సరికాదు.
– జయరాజు, విశ్రాంత ఉపాధ్యాయుడు,
మాజీ జనరల్ సెక్రటరీ, యూటీఎఫ్