
షూటింగ్ సందడి
బేతంచెర్ల: మండల పరిధిలోని కనుమ కింది కొట్టాల గ్రామ సమీపాన ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన బిళ్ల సర్గం గుహల వద్ద మంగళవారం సినిమా షూటింగ్‌తో సందడి నెలకొంది. హైదరాబాద్‌కు చెందిన సినిమా బృందం సత్యదేవ్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంఽధించి చిత్రీకరణ జరుపుతోంది. ఇందుకోసం వేసిన సెట్టింగ్‌లు, తాత్కాలిక గుడిసెలు, నటీనటుల మేకప్, సినీ సరంజామా, ఆర్టిస్టులు, పర్యాటకులతో సందడి నెలకొంది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పటి ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిళ్ల సర్గం గుహల అభివృద్ధికి పర్యాటక శాఖ తరఫున రూ.2.50 కోట్ల నిధులు మంజూరు చేయించారు. దీంతో గుహలలో ఫుట్‌పాత్ వే తో పాటు లైటింగ్, రెస్టారెంట్, టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు. పనులు పూర్తయిన తర్వాత 2024 జనవరి 29 నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో పర్యాటకుల సంఖ్య పెరగడమే గాకుండా సినిమా షూటింగ్‌లకు సైతం అనుకూలంగా మారింది. గతేడాది రాచరికం సినిమా, ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ జరుగుతుండటంతో బిళ్ల సర్గం గుహల వద్ద సందడి నెలకొంది.

షూటింగ్ సందడి

షూటింగ్ సందడి

షూటింగ్ సందడి