
కోతి దాడిలో 12 మందికి గాయాలు
కోడుమూరు రూరల్: ఒక కోతి బీభత్సం సృష్టిస్తూ వారం రోజుల వ్యవధిలో 12 మందిని కరిచింది. కోడుమూరులోని చిన్నబోయ వీధి, షణ్ముఖరెడ్డి నగర్‌లలో ఉన్న సెల్ ఫోన్ టవర్లపై ఇది నివాసం ఏర్పరచుకుంది. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఎవరు కనిపించినా దాడి చేసి గాయపరుస్తోంది. కోతి దాడి చేసి కరవడంతో రవి, మద్దిలేటి, అఖిల్, సుమలత, లక్ష్మి, బజారమ్మ, క్రిష్ణలతో పాటు మరో ఐదుగురు కోడుమూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. భయంతో ఆయా కాలనీల ప్రజలు బయటకు రావడం లేదు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి కోతిని బంధించాలని ప్రజలు కోరుతున్నారు.

కోతి దాడిలో 12 మందికి గాయాలు