
ఎల్లెల్సీలో అక్రమాల ప్రవాహం!
● ఆధునికీకరణ పనుల్లో నిబంధనలకు తూట్లు ● నాణ్యత లేకుండా వేసిన కాంక్రీట్ ● అస్తవ్యస్తంగా లైనింగ్ పనులు ● చోద్యం చూసిన టీబీ బోర్డు ఇంజినీర్లు
కర్నూలు సిటీ/ఆలూరు రూరల్: తుంగభద్ర దిగువ కాలువ ఆధునికీకరణ పనులు నాసిరకంగా జరిగాయి. టీబీ బోర్డు ఇంజినీర్ల పర్యవేక్షణ లేక పోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరించారు. నాణ్యత లేకుండా కాంక్రీట్ వేయడంతో చిన్న ప్రవాహానికే అది కొట్టుకుపోతోంది. టీబీ డ్యాం నుంచి తుంగభద్ర దిగువ కాలున (ఎల్లెల్సీ)కు 24 టీఎంసీల వాటా ఉంది. ఎమ్మిగనూరు, అలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో ఖరీఫ్, రబీలో 151,413 ఎకరాలకు సాగునీరు, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్ పట్టణాలతో పాటు 195 గ్రామాలకు తాగునీరు అందాల్సి ఉంది. ఎల్లెల్సీ 0/0 నుంచి 241 కి.మీ వరకు టీబీపీ బోర్డు పర్యవేక్షణలో ఉంది. ఈ కాలువను ఏడు దశాబ్దాల క్రితం నిర్మించారు. ఓ సంస్థ సర్వే చేసి హక్కుగా కేటాయించిన వాటా నీటిని రాష్ట్రాలు వాడుకోవాలంటే కాల్వ వరకు లైనింగ్ చేయాలని సూచనలు చేసింది.
పనులు ఇలా..
రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం 2017–18లో ఎల్లెల్సీ పనులు రూ.590.65 కోట్లతో మొదలు పెట్టి వదిలేసింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీసీ ప్రభుత్వం తుంగభద్ర దిగువ కాలువకు వదిలేసిన లైనింగ్ పనులు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఎల్లెల్సీ 205 కి.మీ నుంచి 250 కిలోమీటర్లు వరకు 5 ప్యాకేజీలుగా రూ.180 కోట్లు, మరో నాలుగు ప్యాకేజీలు కర్ణాటక పరిధిలో సుమారు రూ.115 కోట్లు, మూడు డిస్ట్రిబ్యూటీలు రూ.100 కోట్లతో పనులు చేపట్టారు. కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టే సమయానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బళ్లారికి చెందిన ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పెద్దల అడ్డుకోవడంతో ఆలస్యంగా మొదలుపెట్టారు. కాలువకు నాలుగు నెలల క్రితం నీళ్లు బంద్ అయినా పనులు పూర్తి చేయలేకపోయారు.
అక్రమాలు ఇవీ..
కాల్వ లైనింగ్ పనులు 9 ప్యాకేజీల్లో చేపట్టగా ఇందులో 26,29,30, 31 ప్యాకేజీల పనులు కర్ణాటక పరిధిలో వస్తాయి.
205 నుంచి 250 కి.మీ వరకు 21,22,23,24,25 ప్యాకేజీలుగా చేపట్టారు.
21వ ప్యాకేజీ కాంట్రాక్ట్ టీడీపీకి చెందిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కొంత పనిని చేసి, ఈ ఏడాది చేయలేనని నిలిపివేసి వెళ్లిపోయారు.
22వ ప్యాకేజీ కాంట్రాక్టర్ భూపాల్ రెడ్డి చేప ట్టారు. ఈయన చేసిన పనుల్లో ఏ మాత్రం నా ణ్యత ప్రమాణాలు పాటించలేదు. ఎంత శాతం పూ ర్తి అయ్యిందో కూడా ఇంజినీర్లు చెప్పలేకపోతున్నారు.
23వ ప్యాకేజీ కాంట్రాక్ట్ స్టాండర్డ్ ఇనాఫ్రా, 24 ,25 ప్యాకేజీలు శ్రీనివాస ఇన్‌ఫ్రాస్టక్చర్ వారు పను లు దక్కించుకున్నారు. నాణ్యత పాటించడం లేదు.
కాల్వ లైనింగ్ చేసేటప్పుడు ఇరువైపులా గట్టు ను స్లోప్ చేసి ఆ వైన ఎర్రమట్టినింపి గట్టిప డేలా వాటర్ కొట్టి స్లోప్ రోలింగ్ చేయాలి. కానీ ఎక్కడ కూడా స్లోప్ రోలింగ్ యంత్రం వినియోగించలేదు.
కాల్వ గట్టు ఇరువైపులా జేసీబీ బకేట్‌తో స్లోప్ చేసి దానిపై బంకమట్టి వేసిన తరువాత సీసీ లైనింగ్ చేయాలి. కానీ నాణ్యత లేని మట్టిని వినియోగించి లైనింగ్ చేసినట్లు తెలుస్తోంది.
బావాపురం సమీపంలో కాల్వకు నీరొచ్చేందుకు కనీసం 72 గంటల ముందే కాంక్రీట్ పనులు పూర్తి అయి ఉండాలి. కానీ నీరొచ్చేందుకు కొన్ని గంటల ముందు వరకు అక్కడ పనులు చేశారు. అక్కడ వాడిన కాంక్రీట్‌లో కంకర, సిమెంట్‌తో పాటు, ఇసుక వినియోగించాలి. కానీ డస్ట్‌తో వేసి మిల్లర్‌లో మిక్సీ చేసి కాంక్రీట్ వేశారు.
కాలువలో వేసిన కాంక్రీట్ బెడ్‌లో నాణ్యత ప్రమాణాలు పట్టించుకోకపోవడంతో కంకర బయటికే వచ్చింది.
నీరొచ్చిన రోజు పనులు చేశారు
తుంగభద్ర దిగువ కాలువ లైనింగ్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేటట్లు చర్యలు తీసుకున్నాం. నీరొచ్చిన రోజు తెల్లవారుజాము వరకు బాపురం దగ్గర పనులు చేశారు. నీరొచ్చేందుకు మూడు, నాలుగు గంట ముందు వరకు కాంక్రీట్ పని చేయవచ్చు. 21వ ప్యాకేజీలో కొంత పని మాత్రమే చేశారు. కాల్వకు నీరు బంద్ అయ్యాక పెండింగ్ పనిని చేయిస్తాం. – నారాయణ నాయక్, టీబీ డ్యాం ఎస్‌ఈ

ఎల్లెల్సీలో అక్రమాల ప్రవాహం!

ఎల్లెల్సీలో అక్రమాల ప్రవాహం!

ఎల్లెల్సీలో అక్రమాల ప్రవాహం!