
గాయపడిన విద్యార్థిని మృతి
ఎమ్మిగనూరురూరల్: ఆటో బోల్తాపడి గాయపడిన విద్యార్థిని చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీకి చెందిన కురవ వీరనాగుడు, లక్ష్మీల కుమార్తె కురవ సువర్ణ మాచాని సోమప్ప ప్రభుత్వ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. ఈ నెల 9వ తేదీన ఆటోలో వెళ్తుండగా కుక్క అడ్డురావటంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. విద్యార్థిని కురవ సువర్ణకు తీవ్ర గాయాలు కావటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం రాత్రి మృతి చెందారు. విద్యార్థిని మృతదేహానికి స్కూల్ తరఫునన ఉపాధ్యాయులు వెళ్లి నివాళులర్పించారు. కుటుంబానికి ఖర్చుల కోసం ఉపాధ్యాయులు, విద్యార్థులు కలసి రూ. 31 వేలు ఆర్థిక సాయం అందజేశారు. కుమార్తె మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
మల్లెపల్లి చేరిన
‘హంద్రీ–నీవా’ నీరు
కర్నూలు సిటీ: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకానికి విడుదల చేసిన నీరు శుక్రవారం వెల్దుర్తి మండలం మల్లెపల్లి గ్రామ సమీపంలోని మూడో పంపింగ్ స్టేషన్‌కు చేరుకున్నాయి. ఇక్కడ నీటిని పంపింగ్ చేసేంత మట్టం రావాల్సి ఉంది. వెంటనే నా లుగో పంపింగ్ స్టేషన్‌కు నీటిని ఎత్తిపోయనున్నా రు. ప్రస్తుతం మల్యాల నుంచి 1,112 క్యూసెక్కుల నీటిని మూడు పంప్‌ల ద్వారా ఎత్తిపోస్తున్నారు.
చెట్టును ఢీకొన్న కారు
● భార్య మృతి.. భర్తకు గాయాలు
ఎమ్మిగనూరురూరల్: చెట్టును కారు ఢీకొనటంతో భార్య మృతి చెందగా, భర్తకు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కర్నూలుకు చెందిన రామకృష్ణ, ఆయన భార్య లక్ష్మీబాయి(53) ఏపీ 21 బీఎం 9160 నంబర్ గల కారులో కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పలోని తమ బంధువులను చూసేందుకు వెళ్తున్నారు. ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో కర్నూలు నుంచి వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొనింది. ప్రమాదంలో రామకృష్ణకు కాలు విరిగిపోగా, భార్య లక్ష్మీబాయికి తలకు బలమైన గాయం అయ్యింది. ఇద్దరినీ అటుగా వెళ్తున్నవారు చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీబాయి కోలుకోలేక మృతి చెందింది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాదంపై రామకృష్ణ బంధువులకు ఫోన్‌లో పోలీసులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్నట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

గాయపడిన విద్యార్థిని మృతి

గాయపడిన విద్యార్థిని మృతి