
భయం గుప్పిట్లో చదువులు
చిత్రంలో కనిపిస్తున్నది పాణ్యం డిగ్రీ కళాశాల తరగతి గది. 13 ఏళ్ల క్రితం కళాశాల మంజూరు కాగా ఇప్పటి వరకు సొంత భవనం లేదు. తాత్కాలికంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో కొన్ని తరగతి గదులను కేటాయించారు. అప్పటి నుంచి అక్కడే అసౌకర్యాల మధ్య తరగతులు కొనసాగుతున్నాయి. ఆ గదులు కూడా శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు, అధ్యాపకులు భయం గుప్పిట్లో చదువులు సాగిస్తున్నారు. దాదాపు 50 మంది విద్యార్థులు, ఆరుగురు రెగ్యులర్ అధ్యాపకులు, ఐదుగురు గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బంది ఉన్నారు. కళాశాలో బీఏ, బీకాం కంప్యూటర్, బీఎస్సీ బోటనీ కోర్పులు మాత్రమే ఉన్నాయి. కళాశాలకు ల్యాబ్ పరికరాలు మంజూరైనా వాటిని పెట్టేందుకు గది లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. గతంలో కళాశాలకు 4.50 ఎకరాల భూమి కేటాయించేందుకు ప్రతిపాదనలు పంపగా బుట్టదాఖలయ్యాయి. ఉన్నతాధికారులు స్పందించి పాణ్యం డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
– పాణ్యం

భయం గుప్పిట్లో చదువులు