
సాగర్‌కు కొనసాగుతున్న వరద
స్పిల్‌వే నుంచి పరుగులు పెడుతున్న కృష్ణమ్మ
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం డ్యాం మూడు రేడియల్ క్రస్ట్‌గేట్ల నుంచి కృష్ణా జలాలు దిగువకు పరుగులు పెడుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్‌ల నుంచి శ్రీశైలానికి 1,75,422 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 1,69,859 క్యూసెక్కుల నీరు విడుదలైంది. నార్జునసాగర్‌కు విద్యుత్ ఉత్పత్తి అనంతరం, క్రస్ట్ గేట్ల ద్వారా 1,48,259 క్యూసెక్కులు, బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 20,000 క్యూసెక్కులను వదిలారు. కుడిగట్టు కేంద్రంలో 17.264 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 17.397 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. శుక్రవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 203.8904 టిఎంసీల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 882.90 అడుగులకు చేరుకుంది.