
నేషనల్ హైవేస్ ఈఈగా విజయభాస్కర్‌రెడ్డి
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లా నేషనల్ హైవేస్ ఈఈగా సి.విజయభాస్కర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఈఈగా విధులు నిర్వహించిన శంకర్‌రెడ్డి ఎస్‌ఈగా పదోన్నతిపై విజయవాడ నేషనల్ హైవేస్ సర్కిల్‌కు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ కడప ఎన్‌హెచ్ ఈఈగా విధులు నిర్వహిస్తున్న విజయభాస్కర్‌రెడ్డిని ప్రభుత్వం ఇక్కడకు బదిలీ చేసింది. నూతన ఈఈగా బాధ్యతలు చేపట్టిన ఈఈని ఎన్‌హెచ్ డీఈఈలు జగదీష్ గుప్త, రవిచంద్ర, ఏఈఈలు మునిస్వామి, భార్గవ్, శేఖర్, రవికాంత్, అసోసియేషన్ నాయకులు రమణ, కార్యాలయ సిబ్బంది పూలబోకేలు అందించి అభినందనలు తెలిపారు.
డీఈఈగా
రవిచంద్ర బాధ్యతల స్వీకరణ
నేషనల్ హైవేస్ డీఈఈగా రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్‌అండ్‌బీలో కోడుమూరు సబ్ డివిజన్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న రవిచంద్రను ఎన్‌హెచ్‌కు బదిలీ చేస్తూ ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీరు నయూముల్లా ఉత్తర్వులు జారీ చేశారు.
నేటి నుంచి రాష్ట్ర స్థాయి తెలుగు పరిరక్షణ సదస్సు
కర్నూలు కల్చరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి తెలుగు భాష పరిరక్షణ సదస్సు శని, ఆదివారం రెండు రోజుల పాటు కర్నూలు నగరంలో నిర్వహిస్తున్నట్లు సదస్సు అధ్యక్షులు కె.చంద్రశేఖర కల్కూర తెలిపారు. శుక్రవారం సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిథులు పాల్గొంటారన్నారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకు కొండారెడ్డి బురుజు సమీపంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూల మాల వేసి అక్కడి నుంచి సదస్సు జరిగే వేదిక వరకు పాదయాత్ర ఉంటుందన్నారు. రెండో రోజు జరిగే సదస్సులో బోధనా భాషగా తెలుగు, మాతృ భాషగా తెలుగు, అధికార భాషగా తెలుగు, ప్రథమ భాషగా తెలుగు అనే అంశాలపై చర్చి జరుగుతుందన్నారు. సదస్సు కన్వీనర్ పత్తి ఓబులయ్య మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే సదస్సులో ప్రతినిధుల తీర్మానాలను జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపుతామన్నారు. సమావేశంలో సదస్సు ఉపాధ్యక్షులు జేఎస్ ఆర్కే శర్మ, కార్యదర్శి డాక్టర్ దండెబోయిన పార్వతీ దేవీ తదితరులు పాల్గొన్నారు.
ఐదు పీఏసీఎస్‌ల పాలకవర్గాల ఏర్పాటుకు కసరత్తు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని మరో ఐదు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)కు పాలక వర్గాలను నియమించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల, ఆదోని మండలం మదిర, పెద్దతుంబలం, పెద్దహరివనం, గోనెగండ్ల పీఏసీఎస్‌లకు త్రీమోన్ కమిటీల ఏర్పాటుకు ముందస్తుగా సభ్యుల వివరాలను పరిశీలించాలని డీసీవోను రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ ఆదేశించారు. ఇది వరకు 28 సంఘాల వివరాలను పంపగా.. జిల్లా అధికారులు పరిశీలన పూర్తిచేశారు. ఇందులో 24 సంఘాలను త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మైనర్లకు వాహనాలిస్తే యజమానులపై చర్యలు
కర్నూలు: జిల్లాలో మితిమీరిన వేగంతో ప్రమాదాలకు కారణమవుతున్న మైనర్లపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన మైనర్లు ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు నడిపినట్లు గుర్తిస్తే వాటి యజమానులు, తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొదటిసారి పట్టుబడితే కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తామని, రెండోసారి రూ.5 వేలు జరిమానా, మరోసారి పట్టుబడితే తల్లిదండ్రులకు జైలు శిక్ష తప్పదన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. గత ఆరు మాసాల్లో 171 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసి రూ.6.62 లక్షలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

నేషనల్ హైవేస్ ఈఈగా విజయభాస్కర్‌రెడ్డి