
నేడు ఉద్యం వర్క్‌షాపు
కర్నూలు(టౌన్): స్థానిక బి.క్యాంపులోని జిల్లా పరిశ్రమల కేంద్రం కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఉద్యం వర్క్ షాపు నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ అరుణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వర్క్‌షాపులో ఉద్యం రిజిస్ట్రేషన్ పోర్టల్ కింద నమోదు కాని ఎంఎస్‌ఎంఈ(సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు)లకు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ఉద్యం నమోదు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
జెడ్పీ పరిధిలో బదిలీలకు 134 దరఖాస్తులు
కర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలో బదిలీలకు అర్హులైన 134 మంది ఉద్యోగులు తమ దరఖాస్తులను అందజేసినట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపీడీఓ, పరిపాలన అధికారులు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు, లైబ్రరీ, ల్యాబ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు ఉన్నారన్నారు. వీరిలో ఐదేళ్లు ఒకే ప్రాంతంలో సర్వీస్ పూర్తి చేసుకున్న వారు 57 మంది ఉన్నట్లు సీఈఓ పేర్కొన్నారు.
కర్నూలు పెద్దాసుత్రి
● నాలుగు రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎన్‌టిఆర్ వైద్యసేవ కార్యాలయంలో పది అడుగుల నాగుపాము కనిపించింది. గది బయట బుసలుకొడుతున్న పామును చూసి ఓ ఉద్యోగికి గుండె ఆగినంత పనయింది. వెంటనే తేరుకొని కేకలు వేయగా చుట్టుపక్క ఉద్యోగులు వచ్చేసరికి ఓ తొర్రలోకి జారుకుంది. దీంతో మళ్లీ అది బయటకు రాకుండా సిమెంట్‌తో ఆ తొర్రను మూసేశారు.
● ఆసుపత్రిలోని ఓ అధికారి ఛాంబర్‌లో ఎలుకలు విపరీతంగా వచ్చి ఫైళ్లు పాడుచేసేవి. ర్యాట్‌ప్యాడ్‌లు పెట్టినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన కాస్త తెలివిగా ఆలోచించాడు. ఎక్కడికక్కడ బిస్కెట్లను ఏర్పాటు చేయడంతో వాటిని తిన్న ఎలుకలు ఫైళ్ల జోలికి వెళ్లకపోవడం గుర్తించాడు. ఇదేదో బాగుందని అదే ఉపాయాన్ని కొనసాగించారు.
● ఆసుపత్రిలో చెట్ల నీడ ఉందని వెళ్లి భోజనానికి కూర్చుంటే చాలు పందులు, కోతులు, కుక్కలతో పాటు ఎలుకలు కూడా వస్తున్నాయి. వీటి వల్ల రోగుల సహాయకులు ప్రశాంతంగా నాలుగు ముద్దలు కూడా తినలేని పరిస్థితి. రాత్రయితే చాలు దోమల దండయాత్ర నిద్రను దూరం చేస్తోంది. రాత్రిపూట అటుంచితే.. పట్టపగలే ఆసుపత్రి ఆవరణలో పాములు తిరుగాడుతుండటంతో రోగుల గుండె జారుతోంది. ఎలుకలు పట్టేందుకు బోధనాసుపత్రిలో ఏటా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. సమస్య పరిష్కారం కాకపోవడం గమనార్హం.
ముగిసిన ఏపీఈఏపీ సెట్ పరీక్ష
కర్నూలు సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్–ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీఈఏపీ సెట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో 12 కేంద్రాల్లో ఈ నెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు కర్నూలు జిల్లాలో అగ్రికల్చర్ విభాగంలో 6370, ఫార్మసీ నందు 5972 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ పరీక్ష ఈ నెల 21వ తేదీ నుంచి మంగళవారం వరకు జరగ్గా 12,522 మందికిగాను 11,855 మంది హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు మొత్తం 18,892 మందికిగాను, 17,827 మంది హాజరయ్యారు. నంద్యాల జిల్లా నుంచి అగ్రికల్చర్ పరీక్షకు 2849 మంది, ఫార్మసీ పరీక్షకు 2655 మంది, ఇంజినీరింగ్ పరీక్షలకు 5409 మందికిగాను 5205 మంది విద్యార్థులు కలిపి మొత్తం 8258 మందికిగాను 7860 మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.

నేడు ఉద్యం వర్క్‌షాపు

నేడు ఉద్యం వర్క్‌షాపు

నేడు ఉద్యం వర్క్‌షాపు

నేడు ఉద్యం వర్క్‌షాపు