వినోదాల వేసవి శిబిరం.. విజ్ఞానం ఘనం | - | Sakshi
Sakshi News home page

వినోదాల వేసవి శిబిరం.. విజ్ఞానం ఘనం

May 29 2025 8:38 AM | Updated on May 29 2025 8:38 AM

వినోద

వినోదాల వేసవి శిబిరం.. విజ్ఞానం ఘనం

చిన్నారుల ఇష్టానికి విలువ.. బంగారు భవితకు బాట

ఆట విడుపుగా పలు అంశాల్లో తర్ఫీదు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 260 కేంద్రాల్లో శిక్షణ

చదువుతో పాటు పలు అంశాల్లో శిక్షణ

ఉత్సాహంగా పాల్గొంటున్న చిన్నారులు

వ్యక్తిత్వ వికాసం

కలుగుతుంది

సమ్మర్‌ క్యాంప్‌లో చిన్నారుల వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా శిక్షణ ఇస్తున్నాం. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఏటా వేసవి శిబిరం నిర్వహిస్తున్నాం. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని వివిధ అంశాలను నేర్చుకుంటున్నారు. భగవద్గీత శ్లోకాలు, వేదం, యోగ, నృత్యం, హనుమాన్‌ చాలీసా తదితర అంశాలను నేర్పిస్తున్నాం. తల్లిదండ్రుల నుంచి మంచి సహకారం ఉంది.

– స్వామిని సుప్రేమానంద సరస్వతి,

చిన్మయ మిషన్‌

కర్నూలు కల్చరల్‌: వేసవి సెలవులను వృథా చేయకుండా కొత్త అంశాలను నేర్చుకునేందుకు చిన్నారులు ఉత్సాహం చూపుతున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా తల్లిదండ్రులు సహకరిస్తున్నారు. చిన్నారుల ఇష్టానికి అనుగుణంగా పలు శిక్షణా సంస్థలు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ వారి సృజనకు పదును పెడుతున్నాయి. సంవత్సరమంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన బాలబాలికలు వేసవి సెలవుల్లో ఉత్సాహంగా గడుపుతూ, విజ్ఞానంతో పాటు వినోదం పొందుతున్నారు. పిల్లల అభిరుచులకు తగిన విధంగా సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, యోగా, ధ్యానం, స్విమ్మింగ్‌, భగవద్గీత పఠనం, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌, పెయింటింగ్‌. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ లాంటి వివిధ అంశాలతో పాటు ప్రతిభకు పదును పెట్టేలా వేసవి శిక్షణా శిబిరాల్లో మెళకువలు నేర్పుతున్నారు. కొన్ని సంస్థలు ఉచితంగా.. మరికొన్ని సంస్థలు నామమాత్రపు రుసుంతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో చిన్నారులు విజ్ఞానంతో పాటు వినోదం పొందుతున్నారు.

జిల్లావ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేసవి శిక్షణ శిబిరాలు కళకళలాడుతున్నాయి. కర్నూలు నగరంతో పాటు, నంద్యాల, ఆదోని, డోన్‌, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, ఆత్మకూరు పట్టణాలతో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. సుమారు 260 సంస్థలు వివిధ అంశాల్లో తర్ఫీదును ఇస్తున్నాయి. సెలవుల్లో నెల రోజుల పాటు విద్యార్థులకు వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సమయం సద్వినియోగంతో పాటు చిన్నారుల్లో విజ్ఞాన వినోదాంశాలు పెంపొందిస్తున్నారు. తల్లిదండ్రులు సైతం చిన్నారుల అభిరుచికి తగ్గట్లు సమ్మర్‌ క్యాంప్‌లను ఎంపిక చేసి అందులో శిక్షణ ఇప్పిస్తున్నారు. నెల రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాలు చిన్నారుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. జిల్లాలోని అన్ని గ్రంథాలయ శాఖల్లో సై తం ప్రభుత్వ ఆదేశాలతో సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. కర్నూలు నగరంలో చిన్మయ మిషన్‌, ఇ స్కాన్‌, టీజీవీ కళాక్షేత్రం, నృత్యజ్యోతి, ఐరిస్‌ ఫ్లారె ట్స్‌, సత్యసాయి సంస్థ, నైస్‌ సంస్థ, నంద్యాల కళారాధ, ఆదోని కళారాధన సంస్థల్లో శిక్షణ ఇస్తున్నారు.

వినోదాల వేసవి శిబిరం.. విజ్ఞానం ఘనం 1
1/3

వినోదాల వేసవి శిబిరం.. విజ్ఞానం ఘనం

వినోదాల వేసవి శిబిరం.. విజ్ఞానం ఘనం 2
2/3

వినోదాల వేసవి శిబిరం.. విజ్ఞానం ఘనం

వినోదాల వేసవి శిబిరం.. విజ్ఞానం ఘనం 3
3/3

వినోదాల వేసవి శిబిరం.. విజ్ఞానం ఘనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement