
మొదలైన తొలకరి
● నైరుతి ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ● వర్షాధార పంటల సాగుకు జూన్, జూలై నెలలు అనుకూలం
కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో తొలకరి మొదలైంది. ఈ సారి ముందుగానే రుతుపవనాలు విస్తరించాయి. ఈ ప్రభావం వల్ల రానున్న 5 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం ఉదయం వరకు అన్ని మండలాల్లో వర్షం కురిసింది. జిల్లా మొత్తం మీద సగటున 16.1 మి.మీ వర్షపాతం నమోదైంది. మే నెల 27 నాటికి సాధారణ వర్షపాతం 34.9 మి.మీ ఉండగా.. 103.3 మి.మీ వర్షం కురిసింది. వర్షాధారంగా వేరుశనగ, కంది, పత్తి, ఆముదం సాగు చేసే రైతులు ఖరీఫ్ సీజన్‌కు భూములను సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. వర్షాధార పంటల సాగుకు విత్తనాలు విత్తుకునేందుకు జూన్–జూలై మాసాలు అనుకూలమని వ్యవసాయ వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు.
మండలం వర్షపాతం(మి.మీ)
కౌతాళం 42
పెద్దకడుబూరు 38.4
ఎమ్మిగనూరు 37.2
ఆదోని 28.6
హాలహర్వి 26.6
ఆలూరు 24.2
కోసిగి 22.8
గోనెగండ్ల 17.2
మద్దికెర 17.2
ఆస్పరి 14.8