
ప్రమాదపుటంచున ప్రయాణం
రోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు మృత్యువాత పడుతుండగా ఇంకొందరు అవిటివాళ్లవుతున్నారు. అయినా అటు ప్రయాణికులు కానీ.. ఇటు వాహనదారులు కానీ మేల్కోవడం లేదు. రోడ్ల భద్రత వారోత్సవాల పేరుతో పోలీసు అధికారులు సైతం నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నా.. కాసులకు కక్కుర్తి పడి వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. ప్రమాదమని తెలిసినా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని రాకపోకలు సాగిస్తున్నారు. ఐదారుగురు ప్రయాణించే ఆటోలో ఏకంగా 30 మందిని ఎక్కించుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు.
– ఆలూరు