
4న మహానందిలో వైశాఖ శుద్ధ సప్తమి వేడుకలు
మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఈ నెల 4వ తేదీన వైశాఖ శుద్ధ సప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ వేదపండితుడు రవిశంకర అవధాని, ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా మహానంది రుద్రగుండం కోనేరులో స్నానమాచరించి భక్తుల పాపాలను పోగొడుతుందన్నారు. ఆ రోజు స్నానం చేయడం 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గంగానది పుష్కరస్నానంతో సమానమన్నారు. వేడుకల్లో భాగంగా గంగాదేవికి ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పారు.