
హత్య కేసులో నిందితుల అరెస్ట్
కర్నూలు (టౌన్): హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలులోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం సాయంత్రం డీఎస్పీ బాబు ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వవెల్లడించారు. కోడుమూరు మండలం పులకుర్తికి గ్రామంలో మునిస్వామి, మరో వర్గానికి చెందిన నడిపి రంగడు, సురేష్‌కు మధ్య కొన్నేళ్లుగా ఒక అమ్మాయి విషయంలో గొడవలు ఉన్నాయి. గత నెల 26న మునిస్వామి, అతని స్నేహితుడు మహేష్ మద్యం సేవించి ట్రాక్టర్ డ్రైవర్ సోమేష్ వద్దకు వెళ్లి సురేష్ గురించి అరా తీశారు. సురేష్‌కు ఈ విషయాన్ని డ్రైవర్ సోమేష్ చెప్పారు. పులకుర్తి గ్రామంలోని గూడూరు బస్టాప్ వద్ద ఉన్న సురేష్, నడిపి రంగడులపై నాటు కట్టెలు, రాడ్లతో మునిస్వామి వర్గీయులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయ పడిన నడిపి రంగడు ఈనెల 28న కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులను గురువారం మధ్యాహ్న సమయంలో అరెస్టు చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు.
● అరెస్టు అయిన వారిలో మునిస్వామి, శివ రాముడు, పెద్ద బజారి, రాకేష్, సురేష్, నాగరాజు, బంగి తిప్మప్ప (పులకుర్తి గ్రామం) కల్లపరి నాయుడు ఉన్నారు. హత్య ఘటనలో పాల్గొన్న మొత్తం 8 మంది నిందితులను కోడుమూరు సీఐ చిరంజీవి, ఎస్‌ఐ స్వామి, గూడూరు ఎస్‌ఐ తిమ్మయ్య, పోలీస్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాటు కట్టెలు, రాడ్లు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
అమ్మాయి విషయంలో
గొడవ పడే హత్య
వివరాలు వెల్లడించిన
కర్నూలు టౌన్ డీఎస్పీ