
సాక్షి మీడియా నిర్వహించిన మ్యాథ్స్‌బీ పరీక్ష రాశాను. ఈపరీక్ష ఎంతో ప్రయోజనకరంగా ఉంది. తరువాతి పరీక్షకు అర్హత సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇలాంటి పోటీ పరీక్షల వల్ల కొత్త పదాలు, అర్థాలు, కొత్త ఫార్ములాలు తెలుసుకునేందుకు అవకాశం కలుగుతుంది.
– కావ్య, 9వ తరగతి, రవీంద్ర ఇంగ్లీషు మీడియం స్కూల్, కర్నూలు
థ్యాంక్స్ టూ సాక్షి
ఇలాంటి పరీక్షను నిర్వహించినందుకు సాక్షికి థ్యాంక్స్. నాకున్న ఇంగ్లీష్ వర్డ్స్ మెమొరీని స్పెల్‌బీ పెంచింది. పదాలకు భిన్నమైన అర్థాలు తెలిశాయి. ఇది మంచి పోటీ పరీక్ష. తరువాతి రౌండ్‌కు అర్హత సాధిస్తానన్న నమ్మకం ఉంది.
– ఈశ్వర ప్రసాద్, 3వ తరగతి, లిటిల్ ప్లానెట్ స్కూల్, ఎమ్మిగనూరు
పదాలకు అర్థాలు తెలుస్తాయి
సాక్షి మీడియా నిర్వహిస్తున్న స్పెల్‌బీ పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పరీక్షల్లో అర్హత సాధిస్తాననే నమ్మకం ఉంది. స్పెల్‌బీతో ఇంగ్లీష్ పదాలు, అర్థాలు తెలుసుకుంటున్నాను. కొత్త పదాలు పరిచయం అవుతండటంతో భాషాపరిజ్ఞానం పెంచుకుంటున్నాను. – ఎం.సుహాష్, 4వ తరగతి,
రవీంద్ర గ్లోబల్ స్కూల్.

