టీబీ డ్యాంలో నిల్వ ఉన్న నీరు
హొళగుంద: ఉమ్మడి జలాశయం, కర్ణాటక రాష్ట్ర హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయంలో 1,591 అడుగుల వద్ద 12 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి డ్యాం పూర్తి సామర్థ్యం 1,633 అడుగులకు గాను 1,628 అడుగులతో 105.788 టీఎంసీలకు గాను 88 టీఎంసీల నీరు నిల్వ ఉండింది. ఈ ఏడాది వర్షాభావం కారణంగా అతి తక్కువ నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో కేవలం 694 క్యూసెక్కులుండి అవుట్‌ఫ్లో 2,490 క్యూసెక్కులుంది. టీబీ డ్యాం నుంచి జిల్లాలో ప్రవహించే తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) 250 కి.మీ వద్ద 450 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.


