కర్నూలు(హాస్పిటల్): నాటు వైద్యం చేస్తున్న ముగ్గురు మహిళలపై స్థానిక వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శరీన్‌నగర్‌కు చెందిన రమీజాబీ తన కూతురుకు అనారోగ్యం ఉంటే జొహరాపురంలో నాటు వైద్యం చేసే పార్వతమ్మ, సుజాత, రత్నమ్మలను కలిసి చికిత్స చేయించింది. అయితే వారు ఇచ్చిన మందులు తిని కూతురు తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో ఆ ముగ్గురిపై రమీజాబి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముగ్గురు మహిళలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇందులో పార్వతమ్మ అనే మహిళ నన్నూరులో జరిగిన జంటహత్యల కేసులో జైలుకు సైతం వెళ్లి వచ్చింది.