మాట్లాడుతున్న సీపీఓ జేడీ ఎల్.అప్పలకొండ
కర్నూలు(సెంట్రల్): వర్షపాతం నమోదును ప్రకడ్బందీగా చేపట్టాలని సీపీఓ జేడీ అప్పలకొండ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సీపీఓ కార్యాలయంలో ఏఎస్‌ఓలతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెయిన్‌గేజ్‌లు పనిచేయకపోతే చెప్పాలన్నారు. కచ్చితమైన సూచనలు మేరకే వర్షపాతాన్ని నమోదు చేయాలన్నారు. కాగా, సోషియో ఎకనామిక్ సర్వేలో భాగంగా మండలాలు, గ్రామాల్లో ఉన్న ఆరోగ్య సదుపాయాలపై సమగ్రంగా సర్వే చేయాలన్నారు. అంతేకాక సాధారణ అంశాల్లో పరిస్థితులను బట్టిస్థానికంగా ఉండే వంట నూనెలు, ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల ధరల విషయాలను వారానికి ఒకసారి తెలియజేయాలన్నారు. స్థానికంగా ఉండే విద్యా సంస్థలు, వాటి అనుబంధ విభాగాల వివరాలను కూడా సేకరించాలన్నారు. ప్రతి సమాచారం కచ్చితమైనదిగా ఉండాలని సూచించారు.


