ఎవరూ లేని సమయంలో చోరీ

‘‘ఎకై ్సజ్‌ కేసుల్లో పట్టుబడిన మద్యం బాటిళ్లను ధ్వంసం చేసేందుకు 2022 మే 24వ తేదీన వాహనాల్లో లోడ్‌ చేసి తరలించే క్రమంలో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా వెండి వస్తువులను దొంగిలించడానికి అదునుగా భావించారు. పోలీస్‌స్టేషన్‌ ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్న వాటిని గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని సీఐ రూమ్‌లో ఉన్న బీరువాలో భద్రపరచినట్లు విచారణలో తేలింది. సీఐ, ఎస్‌ఐతో పాటు సిబ్బంది మద్యం ధ్వంసం చేయడానికి బయటకు వెళ్లగా అమరావతి ఇంటికి వెళ్లి రాత్రి 11:30 గంటల సమయంలో సివిల్‌ డ్రస్సులో స్టేషన్‌కు వచ్చింది. ఆ సమయంలో సెంట్రీ తప్ప ఎవరూ లేరని గమనించి అతనితో ఐదు నిమిషాలు మాట్లాడి ఇంటికి వెళ్లి తెల్లవారుజామున 2–3 గంటల మధ్యలో భర్త విజయ్‌భాస్కర్‌తో కలసి స్టేషన్‌ కాంపౌండ్‌లోకి చేరుకున్నారు. సీఐ రూమ్‌ వెనుక తెరిచిపెట్టుకున్న గ్రిల్‌ లేని కిటికీలో నుంచి భర్తను పంపించి బీరువాలో భద్రపరచిన రెండు బ్యాగులలో ఉన్న వెండిని దొంగలించారు. మరిది భరత్‌ సింహా సహాయంతో 23 కేజీల వెండిని కరిగించి నగదుగా మార్చుకున్నారు. సొమ్ము యజమాని భారతి గోవిందరాజ్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ విధించిన ఫైన్‌ను చెల్లించి రిలీజ్‌ ఆర్డర్‌ పొంది స్టేషన్‌కు రావడంతో చోరీ విషయం బయటపడింది.’’అని ఎస్పీ తెలిపారు.

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top