న్యూస్‌రీల్
ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన సాగుపై కమ్ముకున్న నీలినీడలు సాగుపై వంద శాతం ఆర్థిక సాయం అంటూ ప్రచారం ఏడాది గడిచినా పెట్టుబడి నిధులు విడుదల చేయని ప్రభుత్వం అప్పులు చేసిన రైతులు ఆర్థిక సాయం కోసం ఎదురు చూపులు ఎన్టీఆర్ జిల్లాలో జీరో పెట్టుబడి కింద 2500 ఎకరాల్లో ఉద్యాన సాగు
అప్రమత్తంగా ఉండాలి
ఎండ తీవ్రతతో అనారోగ్య సమస్యలు చలితో కూడిన జ్వరం, తీవ్రమైన నీరసం అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
దీర్ఘకాలిక రోగులు అప్రమ్తతంగా ఉండాలి
సాగర్ నీటిమట్టం వివరాలు
పెట్టుబడి నిధులు వెంటనే విడుదల చేయాలి
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
అత్యధిక పాల సేకరణ ధర ఘనత విజయ డెయిరీదే
ఘంటసాలలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
మచిలీపట్నంఅర్బన్: ఆర్టీఈ చట్టం 12 (1)(సీ) ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి విడత అర్హుల జాబితాను విడుదల చేసినట్లు కృష్ణా జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త కుమిదిని సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 686 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశా లల్లో మొదటి తరగతిలో 25 శాతం రిజర్వేషన్ కోటా కింద ఉచిత ప్రవేశాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ధ్రువపత్రాలను ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింట్ కాపీతో కేటాయించిన పాఠశాలలో ఏప్రిల్ ఏడో తేదీ లోపు సమర్పించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 18004258599 టోల్ ఫ్రీ నంబర్ సంప్రదించొచ్చని పేర్కొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ లబ్బీపేటకు చెందిన దేవి నేని రామకృష్ణ, కనకదుర్గాంబ అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులకు నిత్యాన్నదానానికి రూ.1,11,116 విరాళం అందచేశారు. ఇబ్రహీంపట్నానికి చెందిన సముద్రాల వీరభద్రరావు, శ్రీలత అమ్మ వారి నిత్యాన్నదానానికి రూ.1,11,116 విరాళం ఆలయ అధికారులకు అందజేశారు. అమ్మ వారి దర్శనం, వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాలయాలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని కలెక్టర్ డి.కె.బాలాజీ కోరారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్థానిక ఆర్‌అండ్‌బీ ఈఈ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. కలెక్టర్, వివిధ శాఖల అధికారులు పరి సరాలను పరిశుభ్రం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగాన్ని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. అమృత్ కృష్ణ పేరుతో గాజు సీసాల్లో తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, జెడ్పీ సీఈఓ కె.కన్నమనాయుడు, డెప్యూటీ సీఈఓ ఆనందకుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించు కుని దేవస్థానం తరఫున అమ్మవారికి విశేష పుష్పార్చన నిర్వహించారు. గులాబీలు, చామంతులు, మల్లెలు, విరజాజులు, తామర పూలు, కాగడాలతో ఆలయ అర్చకులు అమ్మవారికి పుష్పార్చన జరిపించారు. ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మల్లేశ్వరస్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో మహా పూర్ణాహుతిని ఆలయ వైదిక కమిటీ నిర్వహించింది. స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చక బృందం పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపించారు.
పెనమలూరు: మండలంలోని కానూరులో ఉన్న సిద్ధార్థ డీమ్డ్ టూ బీ యూనివర్సీటీలో శనివారం రాష్ట్ర స్థాయి వికసిత్ భారత్ పార్లమెంట్‌పై పోటీలు నిర్వహించారు. ఏపీ మై భారత్ (మేరా యువభారత్) డైరెక్టర్ అంసుమాన్‌ప్రసాద్‌దాస్, ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్ ఈ పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి యువభారత్ పార్లమెంట్ పోటీల్లో ఎంపికై న 100 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. యూనియన్ బడ్జెట్ –2026, వికసిత భారత్ –2047 వైపు భారత యువత పదాన్ని బలోపేతం చేయడంపై పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎం.వెంకటసాహిత్య (గుంటూరు జిల్లా), వి.తనకమయ(అన్న మయ్య జిల్లా), టి.యోగవిష్ణురాజ్ (తిరుపతి జిల్లా) విజేతలుగా గెలిచారు. వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, జిల్లా యువజన అధికారి సుంకరరాము, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జె.శివరామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జి.కొండూరు: సున్నా పెట్టుబడి.. నిత్యం ఆదాయం.. ఆపై ఉపాధి కల్పన.. అంటూ గొప్పగా ప్రచారం చేసిన ప్రభుత్వం ఆ దిశగా ప్రోత్సాహం అందించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జీరో పెట్టుబడితో ఉద్యాన సాగు అంటూ స్వల్ప కాల పంటలను సాగు చేసే రైతులను సైతం ఉద్యాన సాగు వైపు మళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అప్పులు చేసి ఉద్యాన సాగుపై పెట్టుబడి పెట్టిన రైతులకు ఈ ఏడాది మెటీరియల్ నిధులు ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నిధుల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వచ్చే ఏడాది ఉద్యాన సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో...
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు ఎన్టీఆర్ జిల్లాలో 1,307 మంది రైతులు 2,500 ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేశారు. అయితే ఈ సాగుకు 2025–28 వరకు మూడేళ్ల కాలానికి కూలీల ఖర్చు కింద రూ.1,170.23 లక్షలు, మెటీరియల్ ఖర్చు కింద రూ.507.02 లక్షలు మంజూరు చేశారు. మొదటి ఏడాది 2025–26 సంవత్సరానికి కూలీల ఖర్చు కింద రూ.257.16 లక్షలు, మెటీరియల్ ఖర్చు కింద రూ.109.86 లక్షలు రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే మెటీరియల్ ఖర్చుకు సంబంఽధించిన నిధులను ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. కూలీల ఖర్చు నిధులను 20 శాతం ఇంకా విడుదల చేయలేదని సమాచారం. ఇదే కాకుండా 2024–25 సంవత్సరానికి సాగు చేపట్టిన రైతులకు ఈ ఏడాది విడుదల కావాల్సిన నిర్వహణ ఖర్చులు సైతం 20 శాతానికి పైగా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రాయితీ ఇస్తుందని నమ్మి అప్పులు చేసి సాగు చేపట్టిన రైతులు రాయితీ నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.
పథకం ఇలా...
ఉద్యాన పంటల సాగును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వందశాతం రాయితీతో ప్రోత్సహిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండి ఉద్యాన పంటలను సాగు చేసే రైతులకు మూడేళ్ల కాల పరిమితితో విడతల వారీగా నిర్వహణ ఖర్చులను విడుదల చేస్తారు. పండ్ల తోటలకు ఒక రైతుకు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు సాగు చేపట్టేందుకు ఈ పథకంలో ఆర్థిక సాయాన్ని అందిస్తారు. అయితే డ్రాగన్, గడ్డి, గట్లు వెంబడి మొక్కల పెంపకానికి గరిష్టంగా ఎకరం వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఈ విధంగా సాగు చేపట్టిన రైతులు ఉపాధి హామీ పనులకు వెళ్లకుండా తమ తోటలోనే ఏటా వంద రోజులు పనిదినాలు పొందే అవకాశం ఉంటుంది.
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): దేశంలో అత్యధిక పాల సేకరణ ధర, పాడి రైతులకు బోనస్ అందిస్తున్న ఘనత కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ)ది అని సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ 36వ సర్వ సభ్య సమావేశం శని వారం పాలప్రాజెక్టు ఆవరణలోని ఫంక్షన్ హాల్‌లో జరిగింది. యూనియన్ మాజీ చైర్మన్ మండవ జానకీ రామయ్య చిత్రపటానికి చైర్మన్, ఎండీ, సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ ఏడాది యూనియన్ బోర్డు, సంస్థ ఉద్యోగులు సంయుక్త కృషితో సాధించిన వివరాల గురించి చైర్మన్ సభ్యులకు వివరించారు. సమావేశం అనంతరం చైర్మన్ చలసాని ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. పాడి రైతులు ఆర్థికంగా నిలబడటమే కాకుండా వారికి తోడ్పాటును అందించాలనే కృత నిశ్చయంతో పాల సేకరణ ధరను రూ.30 పెంచి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆవుపాల ధరను లీటర్‌కు రూ.20 పెంచేందుకు సర్వ సభ్య సమావేశంలో తీర్మానించామని పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరను కృష్ణా మిల్క్ యూనియన్ చెల్లించబోతుందన్నారు.
పాడి రైతులకు బోనస్‌గా రూ.15 కోట్లు
డిసెంబర్ నుంచి మార్చి వరకు పాడి రైతులకు బోనస్‌గా రూ.15 కోట్లు చెల్లిస్తామని చలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.45 కోట్లు బోనస్‌గా రైతులకు చెల్లించామన్నారు. గత ఏడేళ్లలో కృష్ణా మిల్క్ యూనియన్ రూ.716 వార్షిక టర్నోవర్‌ను రూ.1,265 కోట్లకు పెంచామని, రూ.96 కోట్ల సమితి మిగులు నిధులను రూ.250 కోట్లకు చేర్చామని వివరించారు. సమితి స్థిరాస్తులను రూ.64 కోట్ల నుంచి రూ.320 కోట్లకు పెంచామన్నారు. వీరవల్లిలోని యూనియన్ కొత్త యూనిట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్లు సబ్సిడీ ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీ కొల్లి ఈశ్వరబాబు, సమితి పాలక వర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, ఫీడ్ కమిటీ సభ్యులు, సంఘ అధ్యక్షులు, సమితి అధికారులు పాల్గొన్నారు.
కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు
ఘంటసాల: దేశంలోని ప్రతి పౌరుడికీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం వంటి హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అని అంబే డ్కర్ మనవడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ భీమ్ రావ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. ఘంటసాలలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ అధ్యక్షుడు ఉప్పులేటి దేవీప్రసాద్‌తో కలసి ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యశ్వంత్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పల్లె, నగరంలో అంబేడ్కర్ విగ్రహాలు ఉండటం ఇక్కడి ప్రజలకు ఆయనపై ఉన్న అపారమైన గౌరవానికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య మాట్లా డుతూ.. ఎస్సీలు క్రైస్తవులైతే ఎస్సీ రిజర్వేషన్లు చెల్లవంటూ ఉన్నత న్యాయ స్థానం తీర్పు ఇవ్వడం సమంజసమా అని ప్రశ్నించారు. ఢిల్లీస్థాయిలో గొంతు వినిపించి ఎస్సీలకు రక్షణ కల్పించాలన్నారు. ముందుగా ఘంటసాల వారసత్వ విగ్రహాల నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. సభావేదిక వద్ద బౌద్ధ సంప్రదాయాలతో భంతే ధమ్మ ధజ థెరో ప్రత్యేక పూజలు చేసి అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేయించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైఎస్సార్ సీపీ నాయకులు వేమూరి వెంకట్రావు, వేమూరి ప్రవీణ్, నలకుర్తి సురేష్, జుజ్జువరపు భాగ్యారావు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెపాటి రామకృష్ణ, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు పంత గాని రమేష్, కృష్ణాజిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్, తూమాటి బసవ సుధాకర్, కోటే రామ్‌నాథ్, గద్దె కోటినాగులు, ఏపీ న్యాయశాఖ జాయింట్ సెక్రటరీ వెలగపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): మార్చి చివరి వారంలోనే ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అనేక మంది అనారోగ్య సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. జ్వరం, తల నొప్పితో పాటు కొందరు చలితో కూడిన జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో కొందరు ఎండలోకి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు ఇంకెలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అనారోగ్య సమస్యలు ఇవీ..
5 డిగ్రీలు ప్రభావం ఎక్కువ
ప్రస్తుతం నగరంలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతున్నాయి. అయితే దాని తీవ్రత ఐదు, ఆరు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆల్ట్రావైలెట్ కిరణాలు ఎక్కువగా పడటం ఇందుకు కారణమని వివరిస్తున్నారు. ఓజోన్ పొర బలహీన పడకపోయినప్పటికీ గాలిలో ఉండే దుమ్ము కాలుష్యం ఎక్కువగా ఉండటంతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతున్నట్లు పేర్కొంటున్నారు. ఖీళీ ప్రదేశం లేని ఇరుకు భవనాలు, మార్జిన్ లేని సిమెంటు రోడ్లు, విచ్చలవిడిగా ఏసీల వినియోగంతో ఇలా మార్చిలోనే తీవ్రమైన ఎండలకు కారణం అంటున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి
కాంక్రీట్ జంగిల్‌తోనే అధిక ఉష్ణోగ్రతలు
ప్రస్తుతం విజయవాడ కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో మార్చిలోనే అధిక ఎండలు నమోదవుతున్నాయి. వాటి ప్రభావం కూడా ఐదు నుంచి ఆరు శాతం ఎక్కువగా చూపుతోంది. చెట్లు లేక పోవడం, ఖాళీ ప్రదేశం లేకుండా ఇంటిని అనుకుని ఇళ్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు, చెట్లు లేక పోవడం వంటి కారణాలతో చల్లని వాతావరణ కొరవడింది. ఈ పరిస్థితి మారాలంటే సాయంత్రం వాటర్ స్ప్రిక్లింగ్ చేయడం, మొక్కలు పెంచడం వంటివి చేపట్టాలి.
I
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 535.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది.
ఉపాధి హామీ పథకంలో ఉద్యాన సాగు చేపట్టిన రైతులకు పెట్టు బడి నిధులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకంతో రైతులు అప్పు చేసి పెట్టుబడులకు వెచ్చించారు. ఇప్పుడు మాట తప్పితే ఉద్యాన సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. కూలీల నిధులను వెంటనే విడుదల చేయాలి.
– కోట కల్యాణ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
2025–26 ఏడాదికి ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులకు అందాల్సిన నిధులు ఇలా..
మండలం రైతులు కూలీల ఖర్చు మెటీరియల్ ఖర్చు
(రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో)
ఎ.కొండూరు 133 33.20 7.86
చందర్లపాడు 73 12.52 11.21
జి.కొండూరు 53 7.76 3.92
గంపలగూడెం 65 11.73 2.91
ఇబ్రహీంపట్నం 28 5.43 2.83
జగ్గయ్యపేట 56 9.39 6.73
కంచకచర్ల 44 5.67 3.84
మైలవరం 168 35.93 19.45
నందిగామ 77 11.56 4.49
పెనుగంచిప్రోలు 61 7.43 5.61
రెడ్డిగూడెం 139 29.86 7.99
తిరువూరు 94 19.29 10.35
వత్సవాయి 75 13.38 7.33
వీరులపాడు 66 16.23 6.46
విజయవాడరూరల్ 32 6.00 2.85
విస్సన్నపేట 143 31.79 6.03
ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎండ తీవ్రతకు అనారోగ్యానికి గురైన వారు పలు సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, బాలింతలు ఎండ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐదేళ్లలోపు పిల్లలను బయటకు పంపకూడదు. మంచినీరు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా ఆహారం తగ్గించడం ఉత్తమం.
– డాక్టర్ మాచర్ల సుహాసిని, డీఎంహెచ్‌ఓ, ఎన్టీఆర్
మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై ఎండ ప్రభావం త్వరగా చూపుతుంది. వారు త్వరగా డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రతకు గురకాకుండా చూసుకోవాలి. మంచినీరు అధికంగా తాగడం, నీటి శాతం ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం మంచింది. ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. ఎండలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ కె వేణుగోపాలరెడ్డి, మధుమేహ నిపుణుడు


