సాగర్‌ కాలువలో పడి యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాలువలో పడి యువకుడి దుర్మరణం

Mar 29 2026 7:26 AM | Updated on Mar 29 2026 7:26 AM

సాగర్‌ కాలువలో పడి యువకుడి దుర్మరణం

తిరువూరు: ద్విచక్రవాహనం అదుపు తప్పి కాలువలో పడిన సంఘటనలో తిరువూరుకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ శాతకర్ణి తెలిపిన వివరాల ప్రకారం తిరువూరు 12వ వార్డుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు నల్లబోతుల సూర్యకుమార్‌(25) ద్విచక్ర వాహనంపై బైపాస్‌ రోడ్డు నుంచి సుందరయ్య కాలనీ మీదుగా మధిర రోడ్డు వెళుతూ పక్కనే ఉన్న తిరువూరు మేజరు నాగార్జున సాగర్‌ కాలువలో జారి పడిపోయాడు. రాత్రివేళ ఎవరూ గుర్తించకపోవడంతో నీట ముని గి ఊపిరాడక చనిపోయా డు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సూర్యకుమార్‌ మృతదేహానికి తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు అవివాహితుడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement