మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు
చిలకలపూడి(మచిలీపట్నం): దేశ స్వాతంత్య్ర కోసం పోరాడిన మహాత్మాగాంధీ చిరస్మరణీయులని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని సమావేశం హాలులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ మూల సిద్ధాంతాలు సత్యం, అహింస అన్నారు. ఆయన దేశ ప్రజల కోసం ఎనలేని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆయన మార్గం యువతకు ఆదర్శమని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్‌జాహిద్, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్‌కుమార్, గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: ప్రతి స్కానింగ్ సెంటర్‌పై నిర్దిష్టమైన చెక్‌లిస్ట్ ఆధారంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి.యుగంధర్ తెలిపారు. జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యాన లింగ నిర్ధారణ నిరోధక చట్టం జిల్లా సలహా కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌ఓ వెల్లడించారు. జిల్లాలోని 99 స్కానింగ్ సెంటర్లను పర్యవేక్షణలో ఉంచడానికి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, ఎప్పటి కప్పుడు తనిఖీలు, మార్గదర్శకాలు అందజేస్తున్నామని తెలిపారు. లింగ నిర్ధారణ నిరోధక చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో రెండు సెంటర్లకు రెన్యువల్ సర్టిఫికెట్లు, మూడు స్కానింగ్ సెంటర్లకు మార్పులు (మోడిఫికేషన్) సర్టిఫికెట్లు జారీ చేయడానికి ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ ప్రేమ చంద్, లింగ నిర్ధారణ నిరోధక చట్టం జిల్లా సలహా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి సిటీ: ఏపీ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వేదికగా మూడు రోజుల నుంచి జరిగిన రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగిసింది. శుక్రవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టెక్నికల్ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ పద్మారావు హాజరై విజేతలకు బహుమతులు, ధ్రువీకణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సానుకూల దృకథంతో ఉండాలన్నారు. విద్యార్థులు క్రీడలతో ఉన్నత స్థానానికి చేరుతారని ఆయన ఆకాంక్షించారు. బాలుర విభాగంలో విశాఖపట్నం రీజియన్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్‌ను గెలుచుకొన్నారు. బాలికల విభాగంలో ఓవరాల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చాంపియన్ షిప్‌ను కృష్ణా జిల్లా విద్యా ర్థినులు కై వసం చేసుకున్నారు. కార్యక్రమంలో ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణారావు, ప్రిన్సిపాళ్లు ఉషాదేవి, డాక్టర్ ద్వారకనాథ్‌రెడ్డి, ఎస్వీ కుమార్, ఎస్.శ్రీనివాసులు, ఎస్వీయూ పీడీ డాక్టర్ ఎం శివశంకర్‌రెడ్డి, హరిప్రసాద్, రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారు 1500 మంది క్రీడాకారులు, 100 మంది పీడీలు తదితరులు పాల్గొన్నారు.
మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు
మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు


