ఐపీఈ ప్రాక్టికల్స్ నిర్వహణపై ఓరియంటేషన్
మచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ఐపీఈ)–2026 ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఓరియంటేషన్ సమావేశం శనివారం ఇంటర్ పరీక్షల కన్వీనర్, డీఐఈఓ ఎస్. సరళ కుమారి అధ్యక్షతన మచిలీపట్నంలోని లేడీ యాంప్తిల్ గర్ల్స జూనియర్ కళాశాలలో నిర్వహించారు. జిల్లాలోని 84 జనరల్, 14 వృత్తి (ఒకేషనల్) ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలకు కళాశాలల ప్రిన్సిపాళ్లు, రెగ్యులర్ అధ్యాపకులను చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రాక్టికల్ ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్లుగా నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈసీ సభ్యులు, ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అతిథి అధ్యాపకులు మినహా మిగిలిన బోధనా సిబ్బంది, హైస్కూల్ ప్లస్ హెచ్‌ఎంలు, ఏపీఎస్‌డబ్ల్యూఆర్, ఏపీటిడబ్ల్యూఆర్, ఏపీఎంఎస్, కేజీబీవీ సంస్థల ప్రధానోపాధ్యాయులు, ఇంటర్మీడియెట్ బోధన చేస్తున్న లెక్చరర్లు, పీటీజేఎల్‌లు, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పాల్గొన్నారు.


