మాజీ ఎంపీ కంభంపాటిని పరామర్శించిన సీఎం
గన్నవరం: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లిలో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్‌రావు నివాసానికి ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విచ్చేశారు. ఇటీవల మాతృమూర్తి వెంకట నరసమ్మను కోల్పోయిన కంభంపాటిని, ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించి, సానుభూతి తెలిపారు. తొలుత వెంకట నరసమ్మ చిత్రపటానికి చంద్రబాబునాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్‌కుమార్, అదనపు ఎస్పీ సత్యనారాయణ, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రమణ్యం, ప్రత్యేక భద్రతాధికారి శాంతకుమారు తదితరులు పాల్గొన్నారు.


