మా కోసం పోరాడతానన్నారు
మా ఇళ్లు కూల్చివేత తరువాత న్యాయం చేయాలని కోరుతూ కలవని ప్రజాప్రతినిధి లేరు. కనీసం ఘటనా స్థలానికి వచ్చిన వారు లేరు. ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు వెళ్లి కలిశాం. మా బాధలను ఆలకించిన ఆయన మా ప్లాట్ల వద్దకు వస్తానని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చారు. నలభై రెండు మందికి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. విశ్వసనీయతకు మారు పేరైన ఆయన మాలో నమ్మకం కల్పించారు. మా గుండెల్లో బాధను తగ్గించారు.
– గోదావరి గంగ, బాధితురాలు


