సబ్‌జైలులో జిల్లా జడ్జి తనిఖీలు
అవనిగడ్డ: జిల్లా న్యాయమూర్తి జి.గోపీ మంగళవారం అవనిగడ్డ సబ్‌జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిమాండ్ ఖైదీలతో మాట్లాడారు. జైలులో అందుతున్న భోజన వసతి గురించి తెలుసుకున్నారు. స్టోర్ రూం, వంట గదిని న్యాయమూర్తి తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. జైలు ప్రాంగణం అంతా కలియ తిరిగి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గోపీ మాట్లాడుతూ.. బెయిల్ కోసం న్యాయవాదులను పెట్టుకోలోని రిమాండ్ ఖైదీల కోసం న్యాయవాదులను ఏర్పాటు చేస్తామనానరు. ఖైదీల ప్రవర్తన గురించి జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె.వి.రామకృష్ణయ్య, అవనిగడ్డ సీనియర్ సివిల్ జడ్జి కె.అరుణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వర్ణలత ఓల్గా, జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సనకా రఘురామప్రసాద్, న్యాయవాది దామెర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


