మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహం ఆవిష్కరణ
మచిలీపట్నంటౌన్: స్థానిక బైపాస్‌రోడ్డు హౌసింగ్ బోర్డు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ మంగళవారం రాత్రి జరిగింది. మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్‌తో కలిసి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ చేపట్టిన ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన యాత్ర’ బందరుకు చేరిన సందర్భంగా వాజ్‌పేయి విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహ ఏర్పాటును తొలుత టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పోటీగా ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు యత్నించడంతో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి కొల్లు రవీంద్ర జోక్యం చేసుకుని ఈ ప్రాంతంలో వాజ్‌పేయి, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు నిర్ణయించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని జనవరి 18న ఆవిష్కరిస్తారని సమాచారం.


