కుంగ్‌ఫూలో తేజ్‌వీర్‌కు స్వర్ణపతకం
మచిలీపట్నంఅర్బన్: తండ్రి క్రీడా విజయాల బాటలో కుమారుడు కూడా అగ్ర స్థానానికి చేరుకున్నాడు. మచిలీపట్నానికి చెందిన అంతర్జా తీయ కిక్‌బాక్సింగ్ విజేత చలాది సతీష్ కుమారుడు చలాది తేజ్‌వీర్ (09) కుంగ్‌ఫూలో జాతీయ స్థాయిలో స్వర్ణపతకం సాధించాడు. ఈ నెల 14న చిలకలూరిపేటలో నిర్వహించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెమోరియల్ నేషనల్ లెవల్ కుంగ్‌ఫూ, కరాటే చాంపియన్‌షిప్ 2025లో 25 కిలోల లోపు కాటా ఈవెంట్‌లో తేజ్‌వీర్ జాతీయ విజేతగా నిలిచి స్వర్ణపతకం కైవసం చేసుకున్నాడు. తేజ్‌వీర్ తండ్రి సతీష్ గత ఏడాది న్యూఢిల్లీలో వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్‌బాక్సింగ్ ఇండియా (వాకో) ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రెండు రజత పత కాలు సాధించారు. ఇప్పుడు అతని కుమారుడు జాతీయ స్థాయిలో విజయం సాధించడం విశేషం.


