పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి
పిల్లలు సున్నిత మనసుతో ఉంటారు. దేనికైనా వెంటనే ఆకర్షితులవుతారు. తిరునాళ్లు, జాతర్లు, సంక్రాంతి సంబరాల వద్ద నిర్వహించే బెట్టింగ్ గేమ్‌లను సరదాగా ఆడుతూ వాటికి ఆకర్షితులు అవుతారు. తల్లిదండ్రులు ఆ ఆటల వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్మార్ట్ ఫోన్‌లకు దూరంగా ఉంచాలి. బెట్టింగ్‌ల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలి. నిరంతరం పిల్లలపై పర్య వేక్షణ లేకపోతే వారు బెట్టింగ్‌లకు బానిసయ్యే ప్రమాదం ఉంది.
– డాక్టర్ జి.అజయ్‌కుమార్,
పిల్లల వైద్య నిపుణుడు, మైలవరం


