నీడ లేకుండా చేశారు
కుటుంబంతో ఒకటో నంబరు ప్లాట్‌లో నిర్మించిన ఇంటిలో నివసిస్తున్నా. ప్లాటుకొనుగోలు చేసే సమయంలో లీగల్ ఓపీనియన్ తీసుకున్నాం. ఎవ రికై నా అభ్యంతరాలు ఉంటే తెలపాలని పేపరు ప్రకటన కూడా ఇచ్చాం. ఎవరి నుంచీ అభ్యంతరాలు రాలేదు. కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి రూ.70 లక్షలతో ప్లాటు కొనుగోలు చేశాం. అన్ని అనుమతులు తీసుకున్న తరువాతే ఇంటి నిర్మాణం చేపట్టాను. ఇప్పుడు కొందరు గద్దల్లా వాలిపోయారు. 42 ప్లాట్లలో ఇళ్లు బుల్డోజర్లతో కూల్చివేసి, మాకు నిలువ నీడ లేకుండా చేశారు.
– విద్యాసాగర్, బాధితుడు, జోజినగర్


