టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా తనుబుద్ధి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ భవానీపురానికి చెందిన తనుబుద్ధి చంద్రశేఖర్‌రెడ్డి టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి టీఏసీ సభ్యుడిగా తనుబుద్ధి చంద్రశేఖరరెడ్డిని సిఫార్సు చేశారు. ఆయన సిఫార్సు మేరకు నియామకం జరిగింది. చంద్రశేఖరరెడ్డి గతంలో ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. టీఏసీ సభ్యునిగా తనను సిఫార్సు చేసి ఎంపికకు సహకరించిన రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి చంద్రశేఖర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీఏసీ సభ్యుడిగా నియమితులైన తనుబుద్ధి చంద్రశేఖర్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ నేతలు అభినందించారు.
తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
పెడన: తండ్రికి కుమారులు ఎవరూ లేకపోవడంతో కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన కృష్ణాజిల్లా పెడన మండలంలో ఆదివారం జరిగింది. పెడన మండలం పెనుమల్లి దళితవాడకు చెందిన వల్లభు ఏడుకొండలు(56) అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు కొడుకులు లేరు. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తండ్రికి తాను తలకొరివి పెడతానంటూ ఆఖరి కుమార్తె కల్యాణి ముందుకొచ్చింది. పెద్దల సహాయంతో తండ్రి అంత్యక్రియలను పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో పెడన జెడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకట నగేష్ పాల్గొన్నారు.
టెలికం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా తనుబుద్ధి


