
నడకతో రోగాలు వెనకడుగు!
కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి
రోజుకో గంట నడవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు మోకీళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. రోజుకు 45 నిమిషాల నుంచి గంటసేపు నడవాలి. ఎక్కువ సేపు నడిస్తే కీళ్లు అరుగుతాయనేది అపోహ మాత్రమే. సిమెంటు, తారు రోడ్డుపై నడిస్తే మోకీళు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మట్టిపై ఇసుకలో నడిస్తే కీళ్లకు మంచిది. నడకతో మోకీలు చుట్టూ ఉండే కండరాల కదలికల ద్వారా కీళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన గుజ్జు ఉత్పత్తి అవుతుంది.
నడకతో అనేక ప్రయోజనాలు....
● ప్రతిరోజూ 45 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
● కీళ్లకు మేలు చేస్తుంది. మోకీళ్లు చుట్టూ ఉన్న కండరాలు యాక్టివ్‌గా కదలికలు ఉంటే , కీళ్లు ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన గుజ్జును ఉత్పత్తి చేస్తాయి.
● ఎక్కువుగా వాకింగ్ చేస్తే కీళ్లు అరుగుతాయనేది అపోహ మాత్రమే.
● నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణకోశ సమస్యలున్న వారికి నడక మేలు చేస్తుంది. బీపీ, షుగర్ అదుపులో ఉండేలా చేస్తుంది.
ఎక్కడ నడవాలంటే....
● నగరంలో చాలా మంది సిమెంటు, తారు రోడ్లుపై నడుస్తూ కనిపిస్తున్నారు. వాటిపై నడవడం కీళ్లకు ఆరోగ్యకరం కాదని వైద్యులు అంటున్నారు.
● మట్టి రోడ్డు, ఇసుకలో నడవడం కీళ్లకు మంచిదని పేర్కొన్నారు.
● తారు, సిమెంటు రోడ్డుపై నడిస్తే మోకీళ్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.
● వాకింగ్ చేసేటప్పుడు మంచి షూస్ వేసుకోవడం కూడా ముఖ్యమేనంటున్నారు.
● ట్రెడ్‌మిల్‌పై వేగంగా పరుగెడుతుంటారని, గంటకు ఆరు కిలోమీటర్లు మాత్రమే నడవాలని వైద్యులు సూచిస్తున్నారు.
● డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వారు
● మోకీళ్లు అరుగుదల మూడో స్టేజ్‌లో ఉన్న వారు
● స్మోకింగ్‌తో కాళ్ల రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడుతుంటాయి. అలాంటి వారు వాకింగ్ చేయరాదు.
● గుండె సమస్యలున్న వారు, ఆయాసం ఉన్న వా రు వైద్యుల సూచనల మేరకు మాత్రమే చేయాలి.
శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు కీళ్లకు ప్రయోజనం
మోకీళ్లలో గుజ్జు తయారయ్యేందుకు నడక అవసరం
ఎక్కువ నడిస్తే కీళ్లు అరగడం అపోహే
డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్

నడకతో రోగాలు వెనకడుగు!