
దీపోత్సవానికి వేళాయె
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే వేడుక దీపావళికి ఉమ్మడి జిల్లా సిద్ధమైంది. హిందువుల పవిత్ర పండుగల్లో ఒకటైన ఈ పర్వదినాన్ని సోమవారం ప్రజలు సంబరంగా నిర్వహించుకోనున్నారు. ఇంటింటా దీపాలు.. లోగిళ్లలో ప్రమిదల వెలుగులు.. వీధుల్లో పటాకుల మోతలతో హోరెత్తించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే క్రాకర్స్ విక్రయాలు ఊపందుకున్నాయి. మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. అయితే పటాకులు కాల్చే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలతో ఆనందంగా జరుపుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ