
దసరా ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలన
లబ్బీపేట(విజయవాడతూర్పు): దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లను, హోల్డింగ్ ఏరియాలను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదివా రం పరిశీలించారు. వినాయ టెంపుల్ నుంచి ఏర్పా టు చేసిన క్యూలైన్స్‌ను స్వయంగా నడుచుకుంటూ పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చారు. అదే విధంగా వాహనాల కోసం ఏర్పాటు చేసే పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్స్ లలో స్వయంగా నడుచుకుంటూ వెళ్లారు. భక్తులు లోనికి వెళ్లడానికి బయటకు రావడానికి ఏర్పాటు చేసిన మార్గాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. అదేవిధంగా వాహనాల పార్కింగ్ కోసం భవానీపురం, పున్నమిఘాట్ మొదలగు ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలను అందించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ జి. రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సౌత్ ఏసీపీ పవన్‌కుమార్, ట్రాఫీక్ ఏసీపీ జె. రామచంద్రరావు, వన్‌టౌన్ సీపీ గురుప్రకాష్ పాల్గొన్నారు.