
ఫ్రీ బస్సులో మహిళల డిష్యుం..డిష్యుం!
కంచికచర్ల (నందిగామ): ఫ్రీ బస్సు పథకం మహిళల మధ్య ఘర్షణకు దారితీస్తోంది. ఆర్టీసీ బస్సులో ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు బయలుదేరిన ఆర్టీసీ బస్‌లో మహిళలు కొంతమంది సీట్లలో కూర్చున్నారు. సీట్లు ఖాళీలేక మరి కొంతమంది నిలబడ్డారు. సీట్లు లేని మహిళలు బస్సులో నిలబడలేకపోవటంతో సీట్లలో కూర్చున్న మహిళలపై అవాకులు చెవాకులు పేలారు. ఒకరిపై మరొకరు వాటర్ బాటిళ్లు విసిరేసుకున్నారు. అదే సమయంలో పక్కనున్న మహిళలకు కూడా తగలటంతో వారంతా మరో మహిళ చేయిపట్టుకుని దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కండక్టర్ వారితో మాట్లాడి ఘర్షణ సద్దుమణిగేలా చేశారు.

ఫ్రీ బస్సులో మహిళల డిష్యుం..డిష్యుం!