
‘ఇంటింటికీ పరిశుభ్రత’ కిట్ పంపిణీ
పటమట(విజయవాడతూర్పు): అజిత్‌సింగ్‌నగర్‌లోని న్యూ ఆర్‌ఆర్‌పేటలో ఆదివారం వీఎంసీ సిబ్బంది ఇంటింటికీ హౌస్ హోల్డ్ హైజిన్ కిట్ (ఇంటి పరిశుభ్రత కిట్ )ను పంపిణీ చేశారు. అతిసారా నివారణకు ప్రతి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని ఉద్దేశంతో అందజేసిన ఇంటి పరిశుభ్రత కిట్‌లో.. లిక్విడ్ హ్యాండ్ వాష్, సబ్బులు, నాప్ కిన్స్, ఫినాయిల్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కేవలం పంపిణీ చేయడమే కాకుండా ఆహారం తినక ముందు తినిన తర్వాత కూడా చేతులు శుభ్రం చేసుకోవాలని, క్రిములు సోకకుండా ప్రతిరోజు రెండు పూట్ల స్నానం చేయాలని, ఇంటిని, మరుగుదొడ్లను ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ డిహైడ్రేషన్ అయితే ఓఆర్‌ఎస్ నీరు తాగాలని వీఎంసీ సిబ్బంది స్థానికులకు సూచించారు.
స్వామివారికి నిత్యాన్నదాన ట్రాలీలు సమర్పణ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి భక్తుల సౌకర్యార్థం దాత లు ఆదివారం ట్రాలీలు బహూకరించారు. ఉద యం ఆలయంలో ప్రత్యే క పూజలు నిర్వహించిన అనంతరం సుమారు రూ. 1.20 లక్షలతో తయారు చేయించిన ట్రాలీలను ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్‌కు అందజేశారు. దాతలు మచిలీపట్నంకు చెందిన యర్రంశెట్టి వినయ్‌బాబు మిత్రబృందం, కొరియర్ శ్రీను, కురిచేటి అప్పారావు, రాయలపాటి రాజేష్, యడ్ల శివశంకర్ కలసి అన్నదానంలో వినియోగించే ట్రాలీలను అందించినట్లు ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మదుసూధనరావు తెలిపారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆదివారం కావడంతో పలు రాష్ట్రాల నుంచి స్వామివారి దర్వనార్థం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది.
బుడమేరుకు వరద ప్రవాహం
జి.కొండూరు:ఎగువ ప్రాంతాలైన ఏ.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో శనివారం భారీ వర్షం పడడంతో ఆదివారం ఉదయం నుంచి బుడమేరులో వరద ప్రవాహం కొనసాగుతుంది. జి.కొండూరు మండల పరిధి హెచ్.ముత్యాలంపాడు, కందులపాడు గ్రామాల మద్య బుడమేరుపై ఉన్న లోలెవెల్ చఫ్టాపై వరద ప్రవాహం కొనసాగడంతో రాకపోకలు నిలిపివేశారు. వెలగలేరు హెడ్‌రెగ్యులేటర్ వద్ద బుడమేరు వరద ప్రవాహం ఆదివారం సాయంత్రానికి 2.4 అడుగులకు చేరగా 1700 క్యూసెక్కుల వరద ప్రవాహం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్తుంది. అదే విధంగా రెడ్డిగూడెం మండల పరిధి నరుకుళ్లపాడు, ఓబులాపురం గ్రామాల మద్య ఉన్న కళింగవాగు ఆదివారం పొంగి పొర్లడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

‘ఇంటింటికీ పరిశుభ్రత’ కిట్ పంపిణీ

‘ఇంటింటికీ పరిశుభ్రత’ కిట్ పంపిణీ