
నగరాలు సంఘం ఆధ్వర్యంలో పలువురికి సత్కారం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): శ్రీనగరాలు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పలువురు ప్రముఖులను సత్కరించారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్వీ.రావు ప్రారంభ ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మీ జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి మాజీ శాసన
మండలి సభ్యులు దువ్వారపు రామారావు, పోతిన వెంకటమహేష్ విశిష్ట అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నగరాలు రాష్ట్రంలోని 15 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించగలరని చెప్పారు. ఉత్తరాంధ్రలోని పదికిపైగా నియోజకవర్గాలు, పిఠాపురం, పాలకొల్లు, గన్నవరం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బలంగా ఉన్నామని పేర్కొన్నారు. సామాజిక నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరుపిళ్ళ తిరుమలేశ్వరరావు, డైరెక్టర్లతో పాటు బుద్దా వారి దేవస్థాన కమిటీ చైర్మన్ పిళ్లా సుదర్శనరావు, ఏపీసీఎస్ చైర్మన్ పోతిన ప్రసాద్, గొల్లపూడి మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ అడ్డూరి లక్ష్మీ, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బెవర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.