
ఎరువుల దుకాణం పరిశీలన
గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరులో ఒక ఎరువుల దుకాణాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం పరిశీలించారు. స్థానికంగా రైతులకు కావలసిన యూరియా అవసరాలతో పాటు యూరియా నిల్వలను వీఆర్వో శాయన ప్రకాష్‌ను అడిగి తెలుసుకున్నారు. యూరియాను కొరత లేకుండా అందజేస్తామని స్థానిక రైతులకు ఆయన హామీ ఇచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా వైద్యాధికారి సుహాసిని
లబ్బీపేట(విజయవాడతూర్పు): మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుటుందని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. పుట్టిన ఆడశిశువు మొదలు, మహిళలందరి ఆరోగ్య సంరక్షణకు స్వస్థనారి శసక్త్ పరివార్ అభియాన్ అనే పథకాన్ని ఈ నెల 17 ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. అదే రోజు జిల్లాలోనూ ప్రారంభం అవుతుందన్నారు. అందులో భాగంగా అక్టోబర్ 2 వరకూ జిల్లా వ్యాప్తంగా క్యాంపులు ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలపై స్పెషలిస్టు వైద్యులతో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది పాల్గొననున్నట్లు తెలిపారు. కార్యక్రమాల ప్రధాన లక్ష్యం మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కలిగించడం, సమయానుకూల వైద్య సేవలు అందించడం, పోషకాహారం, కుటుంబాలను శక్తివంతం చేయడమని ఆమె తెలిపారు. ప్రత్యేక శిబిరాల ద్వారా మహిళల్లో గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భస్థ క్యాన్సర్, రక్తహీనత వంటి పరీక్షల చేస్తామన్నారు. కిశోర బాలికల్లో హిమోగ్లోబిన్ పరీక్షలు, గర్భిణులకు పోషకాహారంపై జాగ్రత్తను వివరించనున్నట్లు తెలిపారు.

ఎరువుల దుకాణం పరిశీలన