
పత్రికా స్వేచ్ఛపై గొడ్డలిపెట్టు
పత్రికా స్వేచ్ఛను భంగపరచడమే
కక్ష సాధింపు మానుకోవాలి
సాక్షి మీడియా ప్రజల గొంతుకై నిలిచింది. వాస్తవాలను ప్రజలకు తెలియజేసే సంకల్పంతో పని చేస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతోంది. ఏదైనా వార్తా కథనంపై అభ్యంతరాలు ఉంటే ఖండించ వచ్చు. వివరణ కోరవచ్చు. అలా కాకుండా పాత్రికేయులపై, ఏకంగా ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసు పెట్టడం సహేతుకం కాదు. పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏడాదిన్నర కాలంలో సాక్షి మీడియాపై అనేక అక్రమ కేసులు బనాయించింది. ప్రజల గొంతుకగా మారిన సాక్షి గొంతు నొక్కే ప్రయత్నాన్ని ఖండిస్తున్నా. మీడియాపై కక్ష సాధింపు మానుకోవాలి
– మల్లాది విష్ణు,
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ విజయవాడ సెంట్రల్ ఇన్‌చార్జి
నిజాలను నిర్భయంగా రాసే సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయించడం బాధాకరం. పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణపై దాడులు చేయడం అమానుషం. వాస్తవాలు రాసే సాక్షి అంటే కూటమి నాయకులకు అక్కసు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాలో నిజాలు రాస్తే జీర్ణించుకోలేకపో తోంది. ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించడం సరికాదు. ప్రభుత్వ చర్యలను రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు.
– డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు,
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నందిగామ నియోజకవర్గ ఇన్‌చార్జి
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా ఉండే పత్రికా స్వేచ్ఛను కాలరాయాలని చూడటం సబబు కాదు. వాస్త వాలను ప్రజలకు తెలియజేస్తున్న సాక్షిపై ప్రభుత్వం కక్షకట్టింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెలుగులోనికి తెచ్చి ఎండగట్టడం తప్పు ఎలా అవుతుంది. సాక్షి గొంతు నొక్కే విధంగా కూటమి ప్రభుత్వం నడుచుకోవడం ఆక్షేపణీయం. పాత్రికేయుల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– ఉప్పాల హారిక, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్

పత్రికా స్వేచ్ఛపై గొడ్డలిపెట్టు

పత్రికా స్వేచ్ఛపై గొడ్డలిపెట్టు

పత్రికా స్వేచ్ఛపై గొడ్డలిపెట్టు