
మూడు చెక్‌డ్యామ్‌లకు గండ్లు
బుడమేరులో కలిసే ప్రధాన వాగుల్లో పులివాగు ఒకటి. జి.కొండూరు మండలంలోని గంగినేని శివారు కొండల్లో పుట్టిన ఈ వాగు తెల్లదేవరపాడు, సున్నంపాడు, మునగపాడు, చెర్వుమాధవరం, గడ్డమణుగు, జి.కొండూరు గ్రామాల మీదుగా 18 కిలోమీటర్ల మేర ప్రవహించి వెలగలేరు శివారులోని నరసాయిగూడెం వద్ద బుడమేరులో కలుస్తుంది. రైతులకు సాగునీటిని అందించేందుకు దశాబ్దాల క్రితం ఈ వాగుపై పదికి పైగా చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. వరద వచ్చినప్పుడు చెరువులు నింపడానికి, భూగర్భజలాల పెంపు, నిల్వ ఉన్న నీటిని వ్యవసాయ అవసరాలకు వాడుకునేందుకు వీలుగా చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. వీటిలో తెల్లదేవరపాడు, మునగపాడు, చెర్వుమాధవరం చెక్‌డ్యామ్‌లకు గత ఏడాది వచ్చిన వరదలకు గండ్లు పడ్డాయి. చెక్ డ్యామ్‌ల వద్ద రెండు వైపులా అంచులు కోతకు గురై భారీ గండ్లు పడటంతో వరద జలాలు నిల్వ ఉండకుండా, దిగువకు వెళ్లిపోతున్నాయి.